1
వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది. చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది. (ఇంకా…)
1
వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది. చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది. (ఇంకా…)
“సంపూర్ణ అనే సంస్కృతం పదం వాడను కాని, పూర్తి జీవితం ఎలా వుంటుందో నాకు ఇంకా తెలియదు, తెలుస్తుందన్న నమ్మకమూ లేదు. కాని, “యాది” చదివాక ఆ పూర్తి జీవితంలోని కనీసం ఒక కోణం నాకు తెలిసింది. జీవితం ఒక పదిలమయిన యాది ఎలా అవుతుందో తెలిసింది. నలుగురు మనుషుల మధ్య జీవితం పండగ అవుతుందని తెలిసింది. “యాది” నేను ఎప్పుడూ తలుచుకునే పుస్తకం” (ఇంకా…)
ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థ
—————————————————————-
మంచి సాహిత్యాన్ని అచ్చులోకి, అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పానికి రూపం “సారంగ బుక్స్”. మా మొదటి ప్రచురణ 2000 నుంచి 2009 వరకీ వచ్చిన మంచి కవితల సంకలనం. ఈ సంకలనం జూలై మొదటి వారంలో వెలువడుతుంది. (ఇంకా…)
అడపాదడపా అంతర్జాలంలో చదవటమే అఫ్సర్ గారి కవిత్వాన్ని. అక్కడక్కడ, ఆయనని మాటల్లో దించి సందేహాలకు సమాధానాలు వెతుక్కునేవాడిని ఆయన వ్యాసాల్లో. అంతకు మించి ఆయనతో ఎటువంటి పరిచయం లేదు. అంతర్జాలంలో సాహితీ సహవాసానికి, ఆ మాత్రం పరిచయం సరిపోతుందేమో కదా! “ఊరి చివర” ఉప్పెనలా పొంగిన అఫ్సర్ గారి కవిత్వంపై నా అభిప్రాయమే ఈ వ్యాసం. (ఇంకా…)
నండూరి రాజగోపాల్ ఎడిటర్ గా వెలువడుతున్న “చినుకు” సాహిత్య మాస పత్రికలో ప్రముఖ కవి, సాహిత్య విమర్శకులు వంశీ కృష్ణ అఫ్సర్ కొత్త కవితా సంపుటి “ఊరి చివర” గురించి రాసిన సమీక్ష.
మెట్రో బస్ వెనకాతల
వొక కితకితల నల్ల సముద్రమేదో
అల లలుగా తుళ్ళి తుళ్ళి పడ్తుంది
ఏ ఇరుకు నగర శరీరాన్నో పగలగొట్టి
నవ్వుల వానలో ముంచెత్తాలని.
వెనక్కి తిరిగి చూస్తాను
నా లోపలి అతిమర్యాద తెల్లకణమేదో
వొక్క క్షణం మర్యాదగా జూలు విదిలించి
ఆ నల్ల సముద్రంకేసి,
అసయ్యపు చూపులు పొడుస్తుంది.
అలా అలలు అలలుగా యెగసి పడలేక
నవ్వుల తరగలతో ముంచెత్తుకోలేక
నవ్వలేని తనాన్ని దాచుకోలేక
లోపల ఎక్కడో గడి వేసుకుని
దూరానికి దొర్లిపోతాను.
మెట్రో బస్ వెనకాతల
వొక కితకితల నల్ల సముద్రమేదో
హోరు హోరుగా చిలిపి చిలిపిగా
వెంటాడ్తుంది నిద్రలోనూ
నిద్ర కళ్ళు వాలకుండా!
– అఫ్సర్
ఏమవుతుంది,
ఈ ఆకులన్నీ
ఎరుపెక్కి, బంగారు రంగు దాల్చి
రాలిపోయాక?
ఏమవుతుంది,
ఎప్పుడూ పాడే ఆ పిట్టలు
ఇక పాడలేనప్పుడు?
ఏమవుతుంది,
బిరాన పోయే ఆ రెక్కలకు?
అవునంటావా,
ఇక్కడ ఎవరి స్వర్గం వాళ్ళదేనా?
అవునంటావా,
ఆ చీకటి ఆవలి నించి
ఎవరో వొకరు
మనల్నే పనిమాలా పిలుస్తారంటావా?
ఆ చెట్ల ఆవల
పిల్లలకి పాఠాలు చెబ్తూనే వుంటాయి నక్కలు
లోయలో దిలాసగా బతికేదెలాగో?
అవి ఎప్పుడూ కనుమరుగు కావు నిజానికి,
ఎప్పుడూ అక్కడే వుంటాయి
ప్రతి పొద్దూ విరిసే
వెలుగు మొగ్గల్లో
ప్రతి చీకట్లో
ఆకసాన నిలిచి.
ఆ కొండ కోనల వరసలో
సముద్రం వెంబడి
చివరి గులాబీలు
తీయని వాసనల తయారీలో తలమునకలు
లోకానికి ఏదయినా ఇద్దామన్న తపనతో.
ఇంకో జన్మంటూ వుంటే
నేను
వొక చెక్కు చెదరని ఈ సంతోషం కోసమే
అంతా గడిపేస్తా.
నేనో నక్కనవుతాను
వూగే కొమ్మల
చిన్ని చెట్టునవుతాను
ఆ గులాబీల తోటలో
వొక చిన్ని పూవునయినా దిగులు లేదు
భయమంటే ఏమిటో
తెలీదు కదా వాటికి.
కోరిక అంటే ఏమిటో
తెలీదు కదా వాటికి.
అసలు ఎందుకు అన్న ప్రశ్న
మనసులో పుట్టనే పుట్టదు కదా వాటికి.
పోనీ,
ఈ పూవు బతుకు ఎంత కాలం అన్న
దిగులు అసలు లేనే లేదు కదా వాటికి.
అసలు అలాంటెలాంటి
పిచ్చి ప్రశ్నా వాటి మనసుని తొలిచెయ్యదు కదా!
(మేరీ ఆలివర్ 2004 కవిత్వం “బ్లూ ఐరిస్ “లో “రోసెస్, లేట్ సమ్మర్” కి అనువాదం)
The interrupted line sighs;
the suffocation of sudden silence;
someone pants at the rear,
fitfully. (ఇంకా…)