My Journey with “Dalit Literature and Culture”

                                                                                                   

                                                                                                                                                                                    -Sandra Cuadra

          

   As one gets older the chances of having a completely eye opening experience get smaller and smaller. Thanks to the media and a more internationally minded conscious, it is hard to find a topic that one knows nothing about. That is what this course was to me. As naïve as it sounds, I knew nothing about the caste system in India, and had only heard the term Untouchable a couple of times in my life. This class opened new doors for me as it made me see the real life situation in India as well as explore a literature that was completely foreign to me. (ఇంకా…)

ప్రచురితం:  on జనవరి 27, 2008 at 2:33 అపరాహ్నం వ్యాఖ్యానించండి

ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి….

‘ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి. తిన్నగా వెళ్లండి సూర్యుడి కిరణంలాగా’

గత కొన్ని దశాబ్దాలుగా ఇదే వాక్యాన్ని పదేపదే వేరేవేరే సందర్భాల్లో చెబ్తూవచ్చిన తీవ్ర స్వరం హీరాలాల్ మోరియాది. నాకు సాహిత్య ఊహలు తెలుస్తూ, అర్థమవుతూ వచ్చిన పదేళ్ళ ప్రాయంనుంచీ ఇప్పటివరకూ మోరియాని అనేక సందర్భాల్లో చూశాను, విన్నాను. మేం అప్పుడు పల్లెనుంచి పట్నానికి వచ్చిన రోజులు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తెల్లఖద్దరు బట్టల్లో మంచి మల్లెపువ్వులా ఆయన నడిచివచ్చారు. ఆ సాయంత్రం ఆయనా, నాన్నగారు (కౌముది) ప్రపంచ సాహిత్యాన్నంతా ఆగమేఘాల మీద సందర్శించారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు… భాషల అడ్డుగోడల్లేని సాహిత్య సంభాషణ. ఆ రోజు రాత్రి ఆయన వెళ్ళిపోతూ ‘అఫ్సర్ బేటా’ అని నావైపు తిరిగి పైన చెప్పిన ఒకే ఒక్క పంక్తి చెప్పారు. అదేమాట ఆయన రెండేళ్ళ క్రితం నేను మాడిసన్ నుంచి వచ్చినపుడు (2004) మరోసారి మళ్ళీ చెప్పారు. అది ఆయన్నించి నేను విన్న మొదటి, చివరి మాట కూడా! (ఇంకా…)

ప్రచురితం:  on at 1:39 పూర్వాహ్నం వ్యాఖ్యానించండి

I don’t have any birthplace

 I am some limb or organ under a head of vacuum 

From whence I was born, how I grew up,

Just at 47 how I blew up,

Since none of you told me anything .. (ఇంకా…)

ప్రచురితం:  on జనవరి 26, 2008 at 1:21 అపరాహ్నం వ్యాఖ్యానించండి

The Lake of Childhood

It used to be moist somewhat.
When little feet got tired running here
a cool touch used to caress, like mother’s hand. (ఇంకా…)

ప్రచురితం:  on at 1:20 అపరాహ్నం వ్యాఖ్యానించండి

పద్యం పుట్టుక గురించి మళ్ళా …!

 1 

కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి

దాన్ని కప్పేశాం, గుర్తుందా?

మరీ చిన్నప్పటి సరదా కదా,

గుర్తుండి వుండదులే!

*

 పద్యం కూడా అంతేనా ? (ఇంకా…)

ప్రచురితం:  on జనవరి 18, 2008 at 11:51 పూర్వాహ్నం వ్యాఖ్యలు (2)

అసలు ఉద్దేశం అది కానే కాదు…

కవిరాజమూర్తి నవల గురించి నా వ్యాసం ( జూన్ వివిధ)పై జగన్‌రెడ్డి (జూలై 9) రాసిన ఉత్తరం చదివాను. మంచి వివరాలతో, అత్యంత ప్రజా స్వామికమైన స్వరంతో ప్రయోజనకరమైన చర్చకు అవకాశమిచ్చినందుకు జగన్‌కి ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన సమాచారం నాకు మున్ముందు ఈ విషయంలో చేయబోయే పరిశోధనకు చాలా ఉపయోగపడుతుంది. జగన్ అతిముఖ్యమైన విగా భావించిన రెండు విషయాల గురించి నేను కొంత వివరించాల్సి ఉంది. కవిరాజమూర్తి ఉర్దూలో రాయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం కాదు. ఉర్దూ సాహిత్యచరిత్ర (తెలంగాణ అని మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగానే) తెలిసిన వారెవరికైనా ‘హిందూ’రచయితలు ఉర్దూలో రాయడం ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదు. (ఇంకా…)

ప్రచురితం:  on జనవరి 17, 2008 at 1:07 అపరాహ్నం అభిప్రాయములు (1 )

In the Middle of the Poem

The interrupted line sighs;

the suffocation of sudden silence;

someone pants at the rear,

fitfully. (ఇంకా…)

ప్రచురితం:  on జనవరి 16, 2008 at 2:46 అపరాహ్నం వ్యాఖ్యానించండి

తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక ‘అపరిచితుడు’

1944తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా లేదు. నిలువ నీడలేదు. అతికష్టంమీద కోఠీలో ఒక ఇరుకుగది దొరికింది. ఆ ఇరుకుగది అతని ప్రపంచమయ్యింది. కాదు, ప్రపంచమే అతని ఇరుకుగదిలో ఇమిడిపోయింది. ఎందరో తెలం గాణ యువరచయితలకు అది కేంద్రమయ్యింది. (ఇంకా…)

అఫ్సర్…..

అఫ్సర్ నా అసలు పేరు కాదు.

చిన్నప్పుడు పొడుగాటి పేరు యేదో పెట్టారు అమ్మా, నాన్న.

ఇప్పుడు ఆ పేరు కాయితాల మీదే వుండి పోయింది.

అఫ్సర్ అనే పేరు ఇంట్లోనూ, బయటా పిలిచే పేరు అయ్యింది.

ఖమ్మం జిల్లా చింతకాని లొ చిన్నపటి చదువులూ, ఖమ్మంలొ కాలేజీ చదువు, వుస్మానియా లో డాక్టరేటు, ఆ తర్వాత విస్కాన్సిన్-  మాడిసన్ లొ పరిశోధనా, పాఠాలు చెప్పడం.

కల్పన, అనిందు ల తో ఇప్పుడు ఆస్టిన్లో.

యూనివర్సిటి ఆఫ్ టెక్సస్ లొ పాఠాలు చెప్పడం ప్రస్తుత వుద్యోగం.

మూడు కవిత్వ పుస్తకాలు, వొక విమర్శపుస్తకం ఇప్పటి దాకా వచ్చాయి.

అప్పుడప్పుడూ కథలు కూడా రాస్తూ వుంటాను.

‘కథ – స్థానికతా’  అనే పుస్తకం త్వరలో రానుంది.

ప్రచురితం:  on జనవరి 14, 2008 at 1:13 అపరాహ్నం వ్యాఖ్యానించండి

A Grief Outcasted

I know you’re searching for hundreds of reasons

to justify all these killings—whatever.

You know, I’m simply looking for those lives

that are lost forever.

(ఇంకా…)

ప్రచురితం:  on at 4:16 పూర్వాహ్నం వ్యాఖ్యలు (2)