పద్యం పుట్టుక గురించి మళ్ళా …!

 1 

కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి

దాన్ని కప్పేశాం, గుర్తుందా?

మరీ చిన్నప్పటి సరదా కదా,

గుర్తుండి వుండదులే!

*

 పద్యం కూడా అంతేనా ?2

రాయడానికేమీ లేని తనం

నీకూ, నాకూ , బహుశా అందరికీ.

కచ్చితంగా ఇప్పుడే ఇష్టపడలేని హోంవర్కులాగా.

ఎంతకీ ప్రేమించలేని సిలబస్ లాగా.

బాధ లేదని కాదులే!

కాకపోతే, ఎవరి బాధో తప్ప

రాయలేని తనం

అరువు కళ్లతో ఏడుపు,

కొయ్య కాళ్ళతో పరుగు!  

*

ఏదో వొక కొయ్య కాలు చాలదేమో,  లోపలి పద్యానికి!

3

సొంతమూ, పరాయీ అని కాదు కాని

నువ్వు నీ దేహంలో సంచరించడం మానేసి

ఎంత కాలం అయ్యింది, చెప్పకూడదూ, కాస్త!

చర్మం కూడా  పరాయీ చొక్కాలాగే అనిపిస్తోందీ మధ్య.

  

*

మాటలో తేలిపోతుంది, నిజమేదో, కానిదేదో!

 4

తవ్వోడ దొరికింది సరే,

అదే పద్యం అనుకుంటున్నాం

నువ్వూ, నేనూ, అందరం!

లోపలా, బయటా చాలా చాలా తవ్వి పోశాం కానీ,

 లేని చోట తవ్వుకొని, వెతుక్కుంటే – దొరుకుతుందా, పద్యం?

  *

పద్యం పుట్టుక  అసలేమైనా గుర్తుందా?

వుండి వుండదులే,

మరీ చిన్నప్పటి సరదా కదా?!

 *  

ప్రచురితం: on జనవరి 18, 2008 at 11:51 పూర్వాహ్నం వ్యాఖ్యలు (2)

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://afsar2008.wordpress.com/2008/01/18/%e0%b0%aa%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%95-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b3/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

అభిప్రాయములు Leave a comment.

  1. నచ్చింది.

  2. adirindi, hrudayamlonchi molichindi, chala chalaa nachindi


Leave a Comment