1
యెవ్వరికీ చెప్పలేదు కానీ యిక్కడ నేన్నిల్చున్న చోట
వొక జాంచెట్టు పెరుగుతూ వుండేది అనాథలాగా.
గాలీ, ఆకాశం, సూర్యుడూ దాన్ని
అతి ప్రేమగా పెంచేవి యెవ్వరికీ తెలీకుండా ! (ఇంకా…)
యిక్కడేదో వొక జాంచెట్టు…-
మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు
కట్టల కొద్దీ కవిత్వం పంపీ పంపీ చివరకి సహనం కట్టలు తెగిపోయి, ఓ రోజున విశ్వనాథ ముందు రెక్కలు కట్టుకుని వాలాడు శిష్యకవి. “గురువు గారూ, నా పద్యాలు మీకు నచ్చలేదా? ఏమైనా తప్పులునాయా?” అని సవినయంగా అడిగాడు.దానికి విశ్వనాథ “తప్పుల గురించి నాకు బెంగ లేదు కాని, ఇందులో ఒప్పులేమైనా తగలడ్డాయా అని వెతుకుతున్నాను” అన్నారట. సరిగ్గా – జర్మన్ మహాకవి రిల్కే (1875-1926) కూడా అలాంటి సన్నివేశంలోనే ఇరుకున్నాడు ఇరువయ్యో శతాబ్దికి అటూ ఇటూగా. (ఇంకా…)
వాయులీనమవుతూ….
లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి
ఈదురుగాలుల హోరులోనో
అందీ అందని మబ్బుల్లోనో
వొంటరిగా నిలబడి
లోపలికి ప్రవహిస్తాం
జలపాతం వెనక్కి మళ్ళుతుంది లోపల్లోపల. (ఇంకా…)
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి
ఈదురుగాలుల హోరులోనో
అందీ అందని మబ్బుల్లోనో
వొంటరిగా నిలబడి
లోపలికి ప్రవహిస్తాం
జలపాతం వెనక్కి మళ్ళుతుంది లోపల్లోపల. (ఇంకా…)
నెత్తుటి నెమలీక
కాసేపు అంతా మరిచిపోవడమే బాగుంటుందనుకుంటా.పొయ్యిమీద వుడికే జొన్నన్నం వాసనలోంచి ఏ నెత్తుటి జ్ఞాపకమూ కలవరపెట్టకుంటేనే బాగుంటుందనుకుంటా. నరకహింసని విస్మృతిలోకి జారనిచ్చి, సుఖగానమే చేద్దాంలే. మన గతాలు అందమైన రెక్కల గుర్రాలు, వన్నెచిన్నెల నెమలికన్నులు, అంతఃపురాల విలాసగీతాలు. నిజం కన్నా కల అందంగా వున్నప్పుడు, కలలాంటి వొక గతం మేడని కట్టుకుందాం. (ఇంకా…)
తెలుగు డయాస్పోరా: సాహిత్యం, సంస్కృతి
సాహిత్యం మనం సృష్టించుకున్న రెండో లోకం.
ఈలోకంలో కొంత నిజం, కొంత అనిజం- కొంత జీవితం, కొంత కలా కలగలిసి వుంటాయి. ఈ లోకానికి పాఠకుడు ఒక వైపూ, రచయిత ఇంకో వైపూ. వీళ్ళిద్దరూ కలిసే చోటు పుస్తకం. పుస్తకాలు చదివే అలవాటు, పుస్తకాలు రాసే అలవాటు నిజానికి ఒకే ఆలోచనాత్మక ప్రక్రియకి రెండు కోణాలు. పుస్తకం చదువుతున్నప్పుడు పాఠకుడూ, పుస్తకం రాస్తున్నప్పుడు రచయితా ఒకే విధమైన ప్రక్రియలో భాగస్వాములవుతారు. ఇద్దరూ ఆలోచనలోకి ప్రవేశిస్తారు. ఆ ఆలోచనే రెండో లోకం. (ఇంకా…)