అవునా, మైక్?

 michael-jackson-tattoo

 

యెవరికెవరూ అక్కర్లేదు

చావుకి మాత్రమే అందరూ కావాలి

పాడలేని నీ గొంతునీ

కదనుతొక్కలేని నీ కాళ్ళనీ

అలల్ని వోడించే నీ శరీరాన్ని

వొక తెల్లదుప్పటి కప్పేసుకుని (ఇంకా…)

ప్రచురితం:  on జూన్ 26, 2009 at 12:58 అపరాహ్నం వ్యాఖ్యలు (3)

డెడ్ లైన్

 

DEADLINE1-6-09-11640

 

జాఫ్నా 2009: నేల ఇంకో సారి

చిగురుటాకులా కంపించింది

ఆకాశదేహమంతా అవనత పతాకం.   (ఇంకా…)

ప్రచురితం:  on జూన్ 1, 2009 at 2:08 అపరాహ్నం అభిప్రాయములు (1 )

యుద్దం ఇక్కడే…

 

 

 

war1

హు…వీళ్ల చుట్టూ గాలి కూడా కమురు వాసన

నాజీ సైనికుడి అసహన ద్వేష అమానుష నిట్టూర్పు

ఆ యూదు దహన స్థావరాల పరిసరాల పరివేదన ఇప్పుడూ వినిపిస్తుంది. (ఇంకా…)

ప్రచురితం:  on మే 27, 2009 at 10:02 అపరాహ్నం వ్యాఖ్యలు (4)

కొయ్య కన్ను

  అతన్ని రోడ్డు  దాటిస్తున్న

ఆ కర్ర చప్పుడు

నా వెనక నీడలాగా. (ఇంకా…)

ప్రచురితం:  on మే 26, 2009 at 7:06 అపరాహ్నం వ్యాఖ్యలు (2)

మళ్ళీ వస్తారా?

25-11sun35.jpg

తరవాత
నీడతోనే మాటలు.
కలలూ కలవరింతలూ జ్నాపకాలూ
పలవరింతలూ
యెప్పుడూ
వొకే వొక్క వైపు పర్చుకునే చూపు
చివరి అంధత్వాన్ని నిలదీసే వెల్తురు తలుపు
మృత్యువు. (ఇంకా…)

ప్రచురితం:  on ఫిబ్రవరి 16, 2008 at 9:36 అపరాహ్నం వ్యాఖ్యానించండి

పద్యం పుట్టుక గురించి మళ్ళా …!

 1 

కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి

దాన్ని కప్పేశాం, గుర్తుందా?

మరీ చిన్నప్పటి సరదా కదా,

గుర్తుండి వుండదులే!

*

 పద్యం కూడా అంతేనా ? (ఇంకా…)

ప్రచురితం:  on జనవరి 18, 2008 at 11:51 పూర్వాహ్నం వ్యాఖ్యలు (2)

యిక్కడేదో వొక జాంచెట్టు…-

1
యెవ్వరికీ చెప్పలేదు కానీ యిక్కడ నేన్నిల్చున్న చోట
వొక జాంచెట్టు పెరుగుతూ వుండేది అనాథలాగా.
గాలీ, ఆకాశం, సూర్యుడూ దాన్ని
అతి ప్రేమగా పెంచేవి యెవ్వరికీ తెలీకుండా ! (ఇంకా…)

ప్రచురితం:  on జనవరి 14, 2008 at 4:08 పూర్వాహ్నం అభిప్రాయములు (1 )

ఒక సూఫీ సాయంత్రం

సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు
ఇంకా తెరుచుకోలేదు (ఇంకా…)
ప్రచురితం:  on at 2:20 పూర్వాహ్నం అభిప్రాయములు (1 )

ఇంకో చోటికి…

 వెనక్కి రాదు
దూరాల సొరంగంలోకి
జారిపోయాక, రైలు.

కాసేపే
ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ
ఎదురుచూపులూ తలపోతలూ
చివరి ఎడబాటు దాకా. (ఇంకా…)
ప్రచురితం:  on at 2:15 పూర్వాహ్నం వ్యాఖ్యానించండి

వాయులీనమవుతూ….

లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి
ఈదురుగాలుల హోరులోనో
అందీ అందని మబ్బుల్లోనో
వొంటరిగా నిలబడి
లోపలికి ప్రవహిస్తాం
జలపాతం వెనక్కి మళ్ళుతుంది లోపల్లోపల. (ఇంకా…)
ప్రచురితం:  on at 2:12 పూర్వాహ్నం వ్యాఖ్యానించండి