అక్షరం » తెలంగాణ

ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి….
‘ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి తిరిగి చూడకండి. తిన్నగా వెళ్లండి సూర్యుడి కిరణంలాగా’

గత కొన్ని దశాబ్దాలుగా ఇదే వాక్యాన్ని పదేపదే వేరేవేరే సందర్భాల్లో చెబ్తూవచ్చిన తీవ్ర స్వరం హీరాలాల్ మోరియాది. నాకు సాహిత్య ఊహలు తెలుస్తూ, అర్థమవుతూ వచ్చిన పదేళ్ళ ప్రాయంనుంచీ ఇప్పటివరకూ మోరియాని అనేక సందర్భాల్లో చూశాను, విన్నాను. మేం అప్పుడు పల్లెనుంచి పట్నానికి వచ్చిన రోజులు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తెల్లఖద్దరు బట్టల్లో మంచి మల్లెపువ్వులా ఆయన నడిచివచ్చారు. ఆ సాయంత్రం ఆయనా, నాన్నగారు (కౌముది) ప్రపంచ సాహిత్యాన్నంతా ఆగమేఘాల మీద సందర్శించారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు… భాషల అడ్డుగోడల్లేని సాహిత్య సంభాషణ. ఆ రోజు రాత్రి ఆయన వెళ్ళిపోతూ ‘అఫ్సర్ బేటా’ అని నావైపు తిరిగి పైన చెప్పిన ఒకే ఒక్క పంక్తి చెప్పారు. అదేమాట ఆయన రెండేళ్ళ క్రితం నేను మాడిసన్ నుంచి వచ్చినపుడు (2004) మరోసారి మళ్ళీ చెప్పారు. అది ఆయన్నించి నేను విన్న మొదటి, చివరి మాట కూడా!

మోరియాని తలచుకొంటే నా బాల్యం గుర్తొస్తుంది. మోరియాని తలచుకుంటే యాభైయేళ్ల తెలంగాణ సాహిత్య ప్రయాణం గుర్తొస్తుంది. మోరియాని తలచుకుంటే ఒక మహోద్యమ వారసత్వాన్ని గర్వంగా భుజానికెత్తుకున్న వ్యక్తి కనిపిస్తాడు. ఆయన రాజకీయాల్లో ఎన్నాళ్ళున్నారో నాకు గుర్తులేదు. ఆ మాటకొస్తే ఆయన ఎప్పుడూ ఆ రాజకీయోద్యమాన్ని గురించి మాట్లాడ్డం నేను విన్లేదు. ఎప్పుడు కలిసినా ఆయన చుట్టూ సాహిత్య సంభాషణల జడివాన. రచయిత ఎప్పుడూ రచయితగానే ఉండాలని ఆయన అనేవారు. ఖమ్మంలో చరిత్రాత్మకమైన విజ్ఞాన నికేతనం గ్రంథాలయం వీధిలో మేడమీది ఆయన గది అంటే నాకు విపరీతమైన ఆకర్షణ. అది గదికాదు. ఒక పెద్ద గ్రంథాలయమే. హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు పత్రికలూ, పుస్తకాల గుట్టలమధ్య ఒక కుర్చీలో తపస్సులో కూర్చున్నట్టు నిరంతరం ఆయన ఏదో రాస్తూ… ఆలోచిస్తూ… ఆయన రాతల్నీ, ఆలోచనల్నీ తెంపుతూ అప్పుడప్పుడూ నేను ఆయన గదిలోకి వెళ్ళేవాణ్ని. నేను వెళ్లిన మరుక్షణం నాకోసం నాకు అత్యంత ఇష్టమైన ‘రసమలై’ స్వీట్ వచ్చేది. అంతకంటే ఇష్టమైన మోరియా మాటల తీయదనం.. మాట మోరియా తొలి ఆయుధం. ఆయన వాక్ ప్రవాహం ముందు నిలబడడం కష్టం. ఆ ప్రవాహలక్షణమే ఆయన సాహిత్యంలోనూ! కథ, కవిత్వం, చరిత్ర, నవల, విమర్శ, అనువాదం… ఇలా ప్రతీ ప్రక్రియ లోనూ మోరియా పనిచేశారు.

‘రచయిత కావడం అంటే ఒక పెద్ద బాధ్యత. ఇవాళ పది పేజీలు రాయనిది నేను రొట్టె ముట్టను’ అనేవారాయన. రోజూ పొద్దున్నే లేచి కలం పట్టుకుని ఆయనలా రాస్తూ కూర్చునే దృశ్యం నాకు చాలా గొప్ప గొప్ప స్ఫూర్తినిచ్చేది. మోరియా అనేక భాషల సంగమం. ఆయన మాతృభాష మరాఠీ, ఆయన రాసిన భాష ఉర్దూ, ఆయనకు పేరొచ్చిన భాష తెలుగు. ఇది భారతీయ సాహిత్య ప్రపంచంలోనే చాలా అరుదైన సన్నివేశం. ఇంతకీ మీ భాష ఏది?’ అని నేను ప్రతిసారీ గుచ్చిగుచ్చి అడిగేవాణ్ని. ‘సాహిత్యం నా భాష. సాహిత్యం దానికదే భాష. నేను ఏ భాషలో రాసినా ఇక్కడ ఉన్న వాళ్లకోసం రాస్తున్నానన్న సంగతిని నేను మరిచిపోను. నాకు సాంస్కృతికంగా జన్మనిచ్చింది తెలంగాణ. ఈ మట్టిలో పుట్టిన గింజలు తిన్నాను. దీని ఉప్పు తిన్నాను. నేను రాసింది కూడా ఈ నేల కోసమే’ అన్నారాయన ఓసారి.

‘మీరు కాంగ్రెస్ నాయకుల మధ్య తిరిగారు. కానీ మీ మాటలు కమ్యూనిస్టులకంటే పదునుగా ఉంటాయి’ అని ఓసారి అంటే… ‘కాంగ్రెస్‌లో ఉండడం నా జీవితంలో చాలా యాదృచ్ఛికంగా జరిగింది. నేను ఎప్పుడూ గరీబుల పక్షం. నా రచనల్లో ఎట్లా కనిపిస్తానో నా జీవితంలోనూ అదే చేశాను. నా మాటకీ, నా రాతకీ, నా చేతకీ ఎప్పుడూ తెగని బంధం’ అన్నారాయన. తెలంగాణ రచయితల సంఘం చాలా క్రియాశీలంగా పనిచేసిన 1950 లలో మోరియా రచనలన్నిట్నీ పరిశీలిస్తే ఆయనపైన సామాజిక ప్రభావాలు ఎంత బలంగా ఉండేవో తెలుస్తుంది. అన్నింటికీ మించి, తన చుట్టూ ఒక గొప్ప సాహిత్య వాతావరణాన్ని సృష్టించుకోవడం మోరియాలో విశేషం. విశ్వనాథ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, రాయప్రోలు, దాశరథి, ఉటుకూరు రంగారావు, కవిరాజమూర్తి, కౌముది, కొలిపాక, గోపాలరావు, మంజు నుంచి ఈ తరం రచయితలదాకా అందరికీ ఆయన ఆత్మీయుడు. వాదాలు ఏవైనా, వివాదాలు ఎన్ని ఉన్నా ఆ మేడమీది ఇంటికి వెళ్లే అందరి మధ్యా పూసలో దారంలా ఆయన తీవ్రస్వరం! ఆయన నిష్క్రమణ తెలంగాణ సాహిత్య చరిత్రకి పెద్ద వెలితి.

అసలు ఉద్దేశం అది కానే కాదు…
కవిరాజమూర్తి నవల గురించి నా వ్యాసం ( జూన్ వివిధ)పై జగన్‌రెడ్డి (జూలై 9) రాసిన ఉత్తరం చదివాను. మంచి వివరాలతో, అత్యంత ప్రజా స్వామికమైన స్వరంతో ప్రయోజనకరమైన చర్చకు అవకాశమిచ్చినందుకు జగన్‌కి ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన సమాచారం నాకు మున్ముందు ఈ విషయంలో చేయబోయే పరిశోధనకు చాలా ఉపయోగపడుతుంది. జగన్ అతిముఖ్యమైన విగా భావించిన రెండు విషయాల గురించి నేను కొంత వివరించాల్సి ఉంది. కవిరాజమూర్తి ఉర్దూలో రాయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం కాదు. ఉర్దూ సాహిత్యచరిత్ర (తెలంగాణ అని మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగానే) తెలిసిన వారెవరికైనా ‘హిందూ’రచయితలు ఉర్దూలో రాయడం ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదు.

రతన్‌నాధ్ సర్షార్ నుంచి ఫిరాక్ గోరఖ్‌పురి, గోపిచంద్ నారంగ్ దాకా చాలా పెద్ద జాబితా ఇవ్వవచ్చు. (సదాశి వగారి పుణ్యమా అని ఉర్దూ సాహిత్యచరిత్రని ఒకటికి పదిసార్లు చదివే అవకాశం దొరికింది నాతోసహా తెలుగువాళ్లకి…). కాబట్టి నేను అడిగిన ప్రశ్న ఆశ్చర్యం లోంచి వచ్చింది కాదు. నేను వ్యాసం రాయడంలో అసలు ఉద్దేశం అది కానే కాదు. ఈ నవల రాసేనా టికే కవిరాజమూర్తి తెలు గులో కొన్ని రచనలు చేసి ఉన్నారు. ముఖ్యంగా, కవి త్వం రాశారు. ఈ నవల ఆయన ఉర్దూలోని మొదటిరచన. తెలుగులో బాగా రాయగలిగి ఉండీ, ఈ నవల ఆయన ఎందుకు ఉర్దూలో రాశారని నేను అడి గాను. ఈ నవల ఉర్దూలో రాయడానికి ఆయనకేమైనా బలమైన కారణం ఉందా అన్నది నా అన్వేషణ. దానికి ఆ నవల తొలిపాఠకురాలిగా వరలక్ష్మిగారు ఏం చెబ్తారన్నది నాకు ముఖ్యం. అలాగే, ఆ కాలం నాటి ముస్లిమేతర పాఠకులు ఉర్దూ సాహిత్యాన్ని ఎలా స్వీకరించారన్నది కూడా అప్పటి సాహిత్య సంస్క­ృతిని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం.

ఇదే సందర్భంలో మరో ముఖ్యమైన ప్రశ్న-విభజన తరవాత ఎంతమంది ముస్లిమేతరులు ఉర్దూలో రాశారు? సైనిక చర్య తరవాతా, విభజన తరవాతా తెలంగాణలో ఉర్దూ స్థానం మారింది. విభజన తరువాత ఉర్దూలో రాసే ముస్లి మేతరుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. (హిందీలో ఈ తేడా చాలా స్పష్టంగా తెలు స్తుంది. అప్పటివరకూ ఉర్దూలో రాసిన చాలా మంది హిందీలోకి మారారు. విభజనకి ముందే హిందీలోకి మారిన ప్రేమ్‌చంద్ చలా కాలంపాటు తను హిందీలో రాయడం ఏమిటన్న సంశయంలో ఉండిపోయాడు. ‘ఎంత అనుకున్నా, నాకు నా మాతృభాష ఉర్దూనే అనిపిస్తోంది. హిందీలో నేను రాయలేకపోతున్నాను’ అని చాలా సందర్భాల్లో ఆయన బాధపడేవాడట). కాని, ఆశ్చర్యంగా-ముస్లిం సంస్క­ృతి గురించీ, ఉర్దూ గురించీ రాసే తరం ఆరంభమైంది. అది అటు హిందీలోను, ఇటు తెలుగులోనూ ఏకకాలంలో జరిగింది.

తెలంగాణ సాహి త్య సాంస్క­ృతిక చరిత్రలోనూ ఇది భిన్నమైన మలుపు. కేశవస్వామి, సదాశివ నుంచి ఇప్పటి లోకేశ్వర్ దాకా కొనసాగుతూ ఉన్న ఈసంప్రదాయాన్ని మనం సునిశితంగా విశ్లేషించాల్సి ఉంది. ఈరచయితలు ఆత్మకథనాలకూ, సంప్రదాయ సాహిత్యరూపాలకూ మధ్య తమవైన కొత్తరచనాధోరణుల్ని ఎందుకు వెతుక్కుంటున్నారో మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక-భాషాపరంగా ఉర్దూపాత్ర తెలంగాణలో ఎలాంటి మార్పులకి గురయిం దో మాట్లాడుకోవడంచాలా ముఖ్యం. ఆ విషయం చెప్పడానికి నాకు కవిరాజమూర్తి నవలలో కొంత వెసులుబాటు ఉంది. కాబట్టి,నేను ఈ నవల గురించి ప్రత్యేకంగా రాయడం మొదలుపెట్టాను. 1940కి ముందు ఉర్దూ గురించి మాట్లాడడానికి మనకి చాలా ఆధారాలు దొరుకుతున్నాయి. అవన్నీ ఉర్దూ స్వర్ణయుగా న్ని చెబుతాయి. (1940కి ముందు తెలంగాణలో ఉర్దూపాత్ర గురించి ఇటీవలనే దాట్ల కవిత ఒక మంచి సిద్ధాంత వ్యాసం రాశారు-కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,2006).

కాని, 1940ల తరువాత ఉర్దూచరిత్ర అంతకంటే ముఖ్యమని నా అభిప్రాయం. తెలుగులో పత్రికారచన, ప్రచురణ, వివిధ సాహిత్య రూపాల విస్తరణలో ఉర్దూది బలమైన ప్రభావం. తెలంగాణ ఆధునికతని నిర్మించడంలో ఉర్దూ కథలు, ఉర్దూ సాహిత్య సంస్క­ృతి గట్టి ఊతాన్నిచ్చాయి. చాలాకాలం ముస్లిమేతరులు ఉర్దూలోనే రాశారు. ఇవన్నీనిజమే. కాని 1947 తరువాత మారినచరిత్ర మాటేమిటి? ఎంత మంది ఉర్దూలో రాయడం కొనసాగించారు? అప్పటివరకూ తెలుగులో రాస్తూ వచ్చిన ఒక రచయిత ఉర్దూలో నవల ఎందుకురాశాడు? అసలు తెలంగాణ జీవితం గురించి ఉర్దూలో అప్పటిదాకా ఏమైనా నవలలు వచ్చా యా? లేకపోతే, కవిరాజమూర్తిదే మొదటి ఉర్దూ నవల అనుకోవాలా? ఈ ప్రశ్నలకి ఇంకా నా దగ్గర సమాధానాలు లేవు. త్వరలో సమాధానాలు దొరక్కుండా పోతాయా అని ఒక ఆశ. ఈ నవల గురించి ఇంకా నా పరిశోధన కొనసాగుతూనే ఉంది కాబట్టి, ఈ ప్రశ్నలకి ఇప్పటికిప్పుడే తొందరపాటు సమాధానాలు ఇవ్వడంనాకు ఇష్టంలేదు.

ఈ నవల తెలంగాణ సాంస్క­ృతికచరిత్రకి ఎలాంటి ప్రతిబింబమో/వ్యాఖ్యానమో నేను ఇంకా ఆలోచించాలి. ఇక- జగన్ ప్రస్తావించిన ఇస్లామీకరణ గురించి. ఇస్లామీకరణగురించి శామ్యూల్ హంటింగ్టన్ మాత్రమే మాట్లాడలేదు. పెట్టుబడిదారీ పుస్తక మార్కెట్ మాయాజాలం వల్ల మనకి అతనిపేరే బాగా వినరావడం మనకాలపు మహావిషాదం. అతను చెప్పింది ఇండియాకి వర్తించదని మార్తా నస్‌బం అనే ప్రసిద్ధ విదుషి ఇటీవలి తన కొత్తపుస్తకంలో ప్రతివాదం చేసింది (క్లాష్ వితిన్, 2007). అయితే, అంతదూరం వెళ్ళక్కర్లేకుండానే- ఒక పల్లెటూరి పిల్లవాడిగా- ఇస్లామీకరణని నేను ఎలా అర్థం చేసుకున్నానో చెబుతాను. ఈ వివరణకి ముందు ఇస్లామీకరణ వొక తిట్టుపదం కాదని గుర్తించాలని నా మనవి. తురకలు లేకపోతే ఊరికి బర్కతు ఉండదని మా చిన్నప్పుడు మా ఊళ్ళో వినేవాణ్ని. బర్కతు- అనే ఇస్లామిక్ విలువ అంత చిన్న చిన్న ఊళ్ళల్లోకి ఎలా వచ్చింది? సాంస్క­ృతిక విలువలు ఖడ్గాల ద్వారా వ్యాపించవని, పరస్పర అనుబంధాల ద్వారా వ్యాపిస్తాయని దక్కనీ చరిత్ర గురించి పరిశోధించిన రిచర్డ్ ఈట న్ ఎక్కడో రాశాడు.

ఆ తరువాత అనేకమంది చరిత్రకారులు, ఆంత్రోపాలజిస్టులు, రచయితలు ఇస్లామీకరణని ఒక పాజిటివ్ ప్రక్రియగా విశ్లేషిస్తూ విలువైన ప్రతిపాదనలు చేశారు. కాని, మనకి శామ్యూల్ హంటింగ్టన్ తెలిసినంతగా వీళ్లెవరూ తెలిసే అవకాశం లేదు. ఇస్లామీకరణ- భారతీయ సమాజాన్ని ప్రజాస్వామీకరించిన పెద్దమార్పు. ఇది ఎలాంటి మార్పో నాకంటే గట్టిగా బలంగా చెప్పినవాళ్లు ఉన్నారు. ఉదాహరణకి- పర్షియన్ సంస్క­ృతి నుంచి ఉర్దూ భాషదాకా ఈ మార్పు ఎలా జరిగిందో ప్రసిద్ధ చరిత్రకారుడు ముజఫర్ ఆలమ్ తన పుస్తకంలో నిరూపించారు (2004). నదీం హుస్నేన్, ముషీరుల్ హసన్‌లాంటి వారు ఈ దిశగా అటు ఆంత్రోపాలజీ నుంచి, ఇటు సాహిత్యం వరకు ఇటీవల చాలా కొత్త విషయాలు చెప్పారు. అవన్నీ వివరంగా చెప్పుకోదగిన సంగతులు. సాహిత్యం గురించి మాట్లాడడానికి మిగిలిన శాస్త్రాల సహాయం ఎంత అవసరమో వాళ్ళ కృషి ద్వారా మనకి అర్థమవుతుంది. మళ్లీ మన పల్లెల్లోకి వద్దాం. అయిదు వందల సంవత్సరాలుగా ఆ మారుమూల పల్లె బతుకుల్లో ఇస్లామీకరణ ఓ పెద్ద మలుపు. స్థానిక పరిధుల్లో ప్రతిఘటనకి అది ఒక ‘నిశ్శబ్ద’ సాధనం.

(బహుశా, ఈ కారణం వల్లనే గద్దర్ పాటలకి పీర్లపండగ పాటలు బాణీలయ్యాయి. గోరటి వెంకన్న కొత్త పాటల్లో సూఫీ నడకా/నడతా కనిపిస్తాయి.) ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, దళితుల బతుకు ల్లో రకరకాల షియా ఇస్లామిక్ ప్రతీకలూ, భావనలూ, భక్తి ధోరణులు చాతుర్వర్ణ వ్యవస్థని సవాలు చేయడానికి నిశ్శబ్దంగా ఉపయోగపడుతున్నాయి. ‘కుళ్ళాయప్ప ఉన్నారు కాబట్టి బతికిపోయినం, సామీ’ అని ఒక దళితుడు నాతో అన్నాడు. (కుళ్ళాయప్ప అంటే టోపీలతో వచ్చిన తురక స్వాములు) ఈ మార్పు శామ్యూల్ హంటింగ్టన్‌కి ఎప్పుడు అర్థమయ్యేను? ఈ గ్రామా ల్లో నేను విన్న మౌఖిక కథనాల్లో అత్యంత విలువైన సాంస్క­ృతిక వ్యక్తీకరణలున్నాయి. కబీర్ మనసు మార్చింది వేమన అంటూ ఓ తొంభయ్యేళ్ల దళితుడు ఆసక్తికరమైన కథ చెప్పాడు. అందులో నిజమెంత అన్నది అప్రస్తుతం కాని, ఆ ఇద్దరికీ పొంతన కుదర్చడంలో అతని భావన వెనక ఒక సామాజిక తాత్విక చరిత్రే ఉంది. దానికంటే ముఖ్యంగా మూసలోంచి ఆలోచిస్తే స్థానికత అర్థం కాదన్న పాఠం కూడా ఉంది.

ఇస్లామీకరణ అనేక రూపాల్లోంచి పరిశీలించాల్సిన ఆసక్తికరమైన అంశం. శామ్యూల్ హంటింగ్టన్‌కి భయపడి ఆ అన్వేషణకి అడ్డుకట్ట వెయ్యక్కర్లేదు. లేదా, కేవలం హిందూత్వవాదుల కళ్లద్దాల్లోంచి మాత్రమే దాన్ని చూడాల్సిన అవసరం లేదు. మళ్లీ కవిరాజమూర్తి దగ్గరికి వద్దాం. హైదరాబాద్ స్టేట్‌ని ఒకానొక బలహీనమైన దశలో ఇస్లామిక్ స్టేట్‌గా ప్రకటిం చాడు నిజాం. అతని ఇస్లాం నేను చిన్నప్పటినుంచీ ఊళ్లలో చూసిన ఇస్లాం వొకటి కాదు. ‘పల్లె ఇస్లాం’కీ, నిజాం ఇస్లాంకీ వ్యత్యాసాలు ఉండడం వల్లనే, తెలంగాణ పల్లెల్లో నిజాం చర్యలు విపరీత పర్యవసానాలకి దారితీశాయి. పల్లెల ఉనికి నిర్మాణంలో స్థానికత చాలా బలమైన పునాది. ఈ స్థానికత లోంచి పుట్టిన ముస్లిం సంస్క­ృతిలోంచి వచ్చిన కవిరాజమూర్తి నిజాం ‘ఇస్లామీకరణ’ని ప్రతిఘటించ డం సహజం. ఇంతకీ- కవిరాజమూర్తి మీద నేను రాయాలనుకున్న మూడు వ్యాసాల్లో ఇది మొదటిది మాత్రమే. ఇంకా నేను ఆ నవలని పరిచయం చెయ్యాలి. ఆ నవలలో ఆయన ఏ ఇస్లామీకరణ గురించి చర్చించాడో చెప్పాలి. ఆ పని త్వరలో చెయ్యగలనని నమ్మకం.

(July 30, 07 AndhraJyothy)

తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక ‘అపరిచితుడు’
1944తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా లేదు. నిలువ నీడలేదు. అతికష్టంమీద కోఠీలో ఒక ఇరుకుగది దొరికింది. ఆ ఇరుకుగది అతని ప్రపంచమయ్యింది. కాదు, ప్రపంచమే అతని ఇరుకుగదిలో ఇమిడిపోయింది. ఎందరో తెలం గాణ యువరచయితలకు అది కేంద్రమయ్యింది.

అక్కడ తన కలల్ని నిజం చేసే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ని అతను స్థాపించాడు. ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఒక బుక్‌స్టాల్ ప్రారంభించి, టాల్‌స్టాయ్,దాస్తవస్కీ లాంటి రష్యన్ రచయితలతో పాటు గొప్ప ఉర్దూ పుస్తకాలు తెప్పించాడు. అవి అమ్మగా వచ్చిన కాసినిడబ్బులతో ఏపూటకి ఆ పూట గడిచిపోయేది. అంతటి దుర్భర దారిద్య్రంలోనూ అతని కవితాత్మ రాజీపడలేదు. ఈ ఇరుకుగదిలో ఉండగానే అతనొక మంచి నవల రాశాడు. అదీ దక్కనీ ఉర్దూలో! ఆ రచయిత పూర్తిపేరు సర్వదేవభట్ల నరసింహమూర్తి. అతని కలంపేరు ‘కవిరాజమూర్తి’. అతను ఉర్దూలో రాసిన నవలపేరు ‘మై గరీబ్ హూఁ’. కవిగా మాత్రమే అందరికీ తెలిసిన సర్వదేవభట్ల నరసింహమూర్తి 1926 అక్టోబర్ నెలలో ఖమ్మంలో జన్మించారు. ఖమ్మంలో నూరేళ్ళ పైబడి చరిత్ర ఉన్న ఆంధ్ర బాలాభివర్థనీ గ్రంథాలయం, విజ్ఞాన నికేతనం ఆయన చదువుకున్న బళ్ళు. ఇప్పుడు ఖమ్మంజిల్లాలో ఉన్న పిండిప్రోలు ఆయన స్వగ్రామం.

తండ్రి వీరభద్రయ్య న్యాయవాది. బాబాయి సర్వదేవభట్ల రామనాథం పెద్ద కమ్యూనిస్టు నాయకుడు. తమ్ముడు విశ్వనాథం ఖమ్మంలో తరువాత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన న్యాయవాది, గాంధేయవాది. రెండో కొడుకు నరసింహమూర్తిని కూడా న్యాయవాదిగా చూడాలన్నది తండ్రి కల. కాని, నరసింహమూర్తి లోకమే వేరు. ఇంకా ఇరవయ్యేళ్ళు నిండకుండానే అతనిపైన కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం పడింది. ముఖ్యంగా బాబా యి రామనాథం గొప్ప స్ఫూర్తి. తరువాత ఉర్దూ అభ్యుదయకవులు నరసింహమూర్తి దారినే మార్చివేశారు. బాబాయి మాదిరిగా ప్రత్యక్ష కమ్యూనిస్టు రాజకీయాల్లోకి రాలేదు నరసింహమూర్తి. ఉర్దూ కవిత్వం మీద మమకారం పెంచుకుని, ఉర్దూలో కవి త్వం చెప్పడం మొదలుపెట్టాడు.

ఉర్దూలో అతని కవిత్వ పటిమకి మెచ్చి నైజాం సర్కారు ‘ప్రజా కవిరాజు’ బిరుదునిచ్చింది. ఆ బిరుదు అందుకునే నాటికి అతనికి పందొమ్మిదేళ్ళు. నైజాం ఇచ్చిన బిరుదు తరువాత ‘కవిరాజమూర్తి’గామారి స్థిరపడిపోయింది. కమ్యూనిస్టుల ఏరివేత ప్రారంభమయిన తరువాత ఈ పల్లెటూరి యువకుడు హైదరాబాద్ చేరుకున్నాడు. అంతకుముందు, అంటే 1944 ప్రాంతాల్లో కవిరాజమూర్తి ఉర్దూ, తెలుగు భాషలలో విస్త­ృతంగా రచనలు చేసినట్టు తెలుస్తోంది. కాని అవి ఏవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అతికష్టం మీద ఈ వ్యాసరచయితకి అందుబాటులోకి వచ్చిన ‘మై గరీబ్ హూఁ’ నవల తెలుగు అనువాదం (రెండో ముద్రణ -1950) వెనుక అట్టమీద వివరాల ప్రకారం ఆయన ఉర్దూలో రెండు నవలలు, ఒక నాటిక, ఒక జముకుల కథ, గేయాలు ప్రచురించినట్టు ఉంది.

ఉర్దూలో ఆయన రాసిన నవలలు ‘లహూకీ లకీర్’ (రక్తరేఖలు), కవితాసంపుటి ‘అంగారే’ (నిప్పురవ్వలు) కూ డా ఇప్పుడు ఎక్కడా లభ్యమవ్వడం లేదు. ‘మై గరీబ్ హూఁ’ నవల తెలుగు అనువాదం మాత్రం ఖమ్మం సాహిత్యచరిత్రపై పరిశోధన చేస్తున్న నరసింహారావుగారి ద్వారా లభించింది. (ఉర్దూమూలం కోసం పరిశోధకుడు వెతుకుతూనే ఉన్నారు). “మై గరీబ్ హూఁ నవల మీరు తెలుగులో చదివితే మీకు ఆ జోష్ (ఊపు)రాదు. అది ఉర్దూలో చదవాలి,అందునా మూర్తిగారు చదువుతుంటే నాకు కళ్ళనీళ్ళు ఆగేవి కావు” అన్నారు కవిరాజమూర్తిగారి భార్య వరలక్ష్మి. డెబ్బయ్ ఆరే ళ్ళ వరలక్ష్మిగారు ఈ నవల పేరు ప్రస్తావించగానే ఒక గొప్ప ఉత్సాహంతో అప్పటి సాహిత్య విశేషాలు చాలా చెప్పారు. నవలలోని కొన్ని సంభాషణల్ని అలవోకగా వినిపించారు. అంతేకాదు, 1946-1950 మధ్య హైదరాబాద్ తెలుగు- ఉర్దూ రచయితల ఉమ్మడి సాంస్క­ృతిక జీవన విధానాన్ని గురించి ఆమె చెప్పిన ప్రతి అంశం తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణానికి ఒక సాధనమే! అంత వృద్ధాప్యంలో కూడా అప్పటి ఉమ్మడి జీవనశైలి ఎలా ఉండిందో ఆమె అనేక జ్ఞాపకాల మధ్యచెప్పుకుంటూ వచ్చారు.

ఊరు వదిలి భాగ్యనగరానికి…!

‘1942, 1946,1949, 1950… ఇవి నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరాలు. 1942లో (అంటే అప్పటికి మూర్తిగారికి పదహారేళ్ళు) మూర్తిగారితో నా పెళ్ళయింది. పెళ్ళయిన మూ డేళ్ళు మాత్రమే మా జీవితంలో సంతోషంగా సాగిన రోజులు. 1946లో ఖమ్మంలో పెద్ద ఎత్తున ఆంధ్రమహాసభ జరిగింది. సుందరయ్యగారు వచ్చారు. చుట్టుపక్కల ఊళ్ళనుంచి వేలకొద్దీ జనం బండ్లు కట్టుకుని వచ్చారు. గొప్ప సభ జరిగింది. కాని మూర్తిగారి జీవితం ప్రమాదంలో పడింది. ఆయన్ని కమ్యూనిస్టు అన్న కసితో ఒక హత్యకేసులో ఇరికించారు. ఇల్లూవాకిలీ ఊరూ వదిలి పొట్టచేతపట్టుకుని హైదరాబాద్ చేరాం. హైదరాబాద్‌లో ఎట్లాబతికామో మాకే తెలీదు. ఈ పూట రొట్టి దొరుకుతుందా,దొరకదా అని ప్రతిపూటా నరకం. కాని మూర్తిగారికి సాహిత్యమే పెద్ద జీవితం. ఆయన ఉర్దూ సాహిత్య జిజ్ఞాస ఎందరినో స్నేహితుల్ని సంపాదించిపెట్టింది.

ఉర్దూ కవులూ,రచయితలతోపాటు బెల్లంకొండ రామదాసు, రెంటాల, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, దేవులపల్లి రామానుజరావులాంటి వాళ్ళంతా ఆ ఇరుకుగదికి వచ్చిపోతుండేవాళ్ళు. నేనూ ఒక మూల కూర్చొని వాళ్ళ మాటలన్నీ వింటూండేదాన్ని. కొద్దికాలానికి- అంటే 1949లో గిడుతూరి సూర్యంగారు హైదరాబాద్ కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అప్పుడే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ కూడా ఏర్పడింది. తరువాత మూర్తిగారికి నృపతుంగ హైస్కూల్లో తెలుగుపండితుడి ఉద్యోగం అయ్యింది. ఆ సమయంలోనే సుల్తాన్‌బజార్‌లో ‘మూర్తీస్ బుక్‌హౌస్’ పేరుతో బుక్‌స్టాల్‌పెట్టారు. కేవలం ఇంగ్లీషు పుస్తకా లు మాత్రమే బొంబాయినుంచి తెప్పించి అమ్మేది. అలా తెప్పించిన పుస్తకాలలో కొన్నాయన నాకు చదివి వినిపించేవారు. ‘అన్నా కెరెనీనా’ ఆయన చదువుతూండగా విన్నవాటిల్లో నాకు నచ్చిన గొప్ప పుస్తకం.

రచన ఒక జ్వరవేదన!

అదే సమయంలో మూర్తిగారు ఉర్దూలో ఏదో రాయడం మొదలుపెట్టారు. ‘ఇది పెద్ద నవల. దక్కనీలో రాస్తున్నా’ అంటూ రోజుకి కొన్ని పేజీలు చదివి వినిపించేవారు. అది రాస్తున్నంత కాలం ఆయన మూర్తీభవించిన అశాంతిలా ఉండిపోయారు; ఏదో జ్వరం వచ్చినట్టే! ఈ నవల ఎప్పుడు పూర్తవుతుందా అని బెంగపెట్టుకునే దాన్ని. కాని ఆయన ఉర్దూలో అది చదువుతున్నంతసేపూ విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యేదాన్ని. ఏదో మంత్రించినట్టుగా కళ్ళప్పగించి వింటూ వుండిపోయేదాన్ని. ఆ భాష, ఆ ప్రవాహం, ఆ వేగం… ‘వినడం కాదు, మాట్లాడు….’ అనేవారాయన. మూర్తిగారు కవిత్వం చాలా రాసినా అది ఎప్పుడూ నాకు వినిపించేవాళ్ళు కాదు. కాని, నవల ప్రతి పేజీ రాసింది రాసినట్టుగా ఏ రోజుకి ఆరోజు వినిపించేవారు.

అలా వినిపించకపోతే ఆయనకి కలం ముందుకి సాగేది కాదు. పైగా ప్రతిపేజీ మీదా ఇద్దరం చాలా సేపు మాట్లాడుకొనేవాళ్ళం”. ఆశ్చర్యంగా నవలలోని ప్రతిభాగం ఇప్పటికీ ఆమెకి కళ్ళకి కట్టినట్టుగా గుర్తుంది. ముఖ్యంగా ‘మై గరీబ్ హూఁ’ అనే వాక్యం పునరుక్తి అయిన ప్రతిసారీ ఆ వాక్యం చుట్టూ మూర్తిగారు అల్లిన సన్నివేశాల్ని ఆమె బాగా గుర్తుంచుకొని చెప్పారు. కాని, ఆమె దగ్గర ఈ నవల తెలుగు అనువాదం లేదు. ‘ఒక్క ఊళ్ళోనూ స్థిరంగా ఉండకపోవడం వల్ల ఎక్కడి పుస్తకాలు అక్కడే పోయాయి. చివరికి ఆయన రచన ఒక్కటీ మా దగ్గర మిగల్లేదు’ అన్నారామె. నా చేతుల్లో ఉన్న ‘మై గరీబ్ హూఁ’ జిరాక్సు ప్రతిని చేతుల్లోకి తీసుకుని, ఆమె కొద్దిసేపు ఆ పుస్తకా న్ని అప్యాయంగా తాకుతూ ఉండిపోయారు.

చాలాసేపు మా ట్లాడిన తరువాత ‘నా దగ్గర మూర్తిగారి ఒకే ఒక పుస్తకం మిగిలింది. అది మీకు ఇస్తాను. తీసుకెళ్ళండి’ అంటూ లోపలకి వెళ్ళి, అతి శిథిలావస్థలో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఆ పుస్తకం పేరు ‘మార్పు’. అది 1949లో మూర్తిగారు రాసిన నాటిక. తెలంగాణలోని గ్రామాల్లో ఈ నాటిక ప్రదర్శించేవారనీ, జనం బాగా వచ్చేవారనీ ఆమెచెప్పారు. ‘మై గరీబ్ హూఁ జిరాక్సు నాకు ఇవ్వండి దయచేసి. మా వద్దలేదు’ అన్నారామె. సంభాషణలో చాలాసేపు ఆమె ఈ నవల గురించి మాట్లాడడానికి ఆసక్తి చూపించారు. ‘అది ఉర్దూలో సంపాదించి, చదవండి’ అని పదేపదే చెబుతున్నప్పుడు ఉర్దూ మూలరచన ఆమెపై ఎంత ప్రభావం కనబరిచిందో తెలుస్తూనే ఉంది. ‘మూర్తిగారు తెలుగులో బాగా రాయగలిగి ఉండీ,ఈ నవలని ఉర్దూలోనే ఎందుకు రాశారు?’ అడిగాన్నేను. ‘ఆయన ఏం రాసినా ముందు ఉర్దూలో రాసేవారు. కవిత్వం, కథ, వ్యాసం ఏదైనా కానివ్వండి.తన భాష ఉర్దూ అని స్పష్టంగా చెప్పేవారు.

ఆయన తెలుగులో రాయడం మొదలుపెట్టింది చాలా కాలం తరువాత. తెలుగులో రాసినా, అదీ ఉర్దూ ప్రభావం తోనే. ఉర్దూ కవుల గురించీ, లేకపోతే వాళ్ళ అనువాదాలే. వ్యక్తిగతంగా నాకు కూడా ఆయన ఉర్దూలో రాస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉండేవారని అనిపించేది. ఆయన వ్యక్తిగా ఎంతో ఉద్వేగశీలి. లోపల చాలా అశాంతి ఉండేది. దానికి అనువైన తీవ్రతా, పదునూ ఉర్దూలో ఉండివుండవచ్చు. పైగా, ఇంటికి ఎవరొచ్చినా ఉర్దూలో వ్యవహా రం నడిచేది. తెలుగులో మొదలైనా, కాసేపట్లో ఉర్దూ దానికదే వచ్చేసేది. ఆయన ఉర్దూలోనే ఆలోచించేవారు. అందుకే, ఆయన తెలుగు రచనల్లోని వాక్యనిర్మాణం కూడా ఉర్దూ ప్రతీకలూ పదచిత్రాలతో నిండి ఉండేదనుకుంటా’. ‘ఈ నవల తెలుగు అనువాదం ఎప్పుడొచ్చింది?’ ‘కనీసం ఏడాది తరువాత, 1950లో నవల అచ్చయింది.

నా అంచనా ప్రకారం ఈ నవల 1948 ప్రాంతాల్లో రాసి ఉంటారు. గిడుతూరి సూర్యంగారు ‘పద్మశాలి ప్రింటింగ్‌ప్రెస్’ పెట్టిన తరువాత తెలుగులోకి అనువదించాలన్న ఆలోచన వచ్చింది.’ ‘ఈ నవల ఆయన మిత్రులు చదవడం,చర్చించడం చేశారా?’ ‘లేదు. ఉర్దూ కవిత్వంగురించి చాలాసేపు చర్చలు జరిగేవి. ఈ నవల ఆయన ఒక స్వగతంలాగా రాసుకున్నారు. తన జీవితం, తన సమాజం, తనకి ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహం… బహుశా… ఈనవల గురించి ఆయన నాతోనే ఎక్కువగా మాట్లాడి ఉంటారు. తెలుగులో ఈనవల అచ్చులోకి వచ్చిన తరువాత, అంటే 1950లలో మళ్ళీ ఆయన మీద నిర్బంధం పెరిగింది. మళ్ళీ ఊరు మారాం.తాండూరు వెళ్ళిపోయాం. ఏడాది తరువాత పటాన్‌చెర్వులో వ్యవసాయశాఖలో ఉద్యోగం దొరికింది.అప్పటిదాకా ప్రాణభయంతోనే బతికారు.

1949 ప్రాంతాల్లోనే ఉర్దూలో ‘తెలంగాణ’ అనే ఒక పక్షపత్రిక నడిపారు. అది పోలీసుచర్య తరువాత ఆరునెలలపాటువచ్చింది’. ‘శ్రీమంతుల కుటుంబంలో పుట్టిన మూర్తిగారు ‘గరీబు’పక్షం ఎందుకు చేరారు?’ ‘కమ్యూనిస్టు పార్టీప్రభావమే! బాబాయి రామనాథం అంటే ఆయనకు ప్రాణం. శ్రీమంతుల కుటుంబంలోపుట్టారన్న మాటేగానీ, ఏనాడూ భోగభాగ్యాలు అనుభవిం చింది లేదు. మేం పిండిప్రోలు నుంచి హైదరాబాద్ పోయేటప్పటికి ఆయనకి ఇరవయ్యేళ్ళలోపే! 1954 వరకూ మళ్ళీ ఖమ్మం మొగమే చూళ్ళేదు. ఇంక ఆ సంపద ఉందో పోయిందో చూసుకున్నదీలేదు. తరువాత ఆయన పార్టీని వదిలివేశారు.కాని,పార్టీభావాల్ని మాత్రం వదల్లేదు. ‘మై గరీబ్ హూఁ’ నవలలో మీకు ఈ విషయం అతి తేలి గ్గా అర్థమైపోతుంది.అందులో పేదవాడు పడ్డకష్టాలేవీ ఊహల్లోంచి పుట్టినవి కావు. ఆయన అనుభవంలోనివే! ఆకథలోని ప్రధానపాత్రధారి’అపరిచితుడు’ ఆయనే.

‘ఈ నవల తరువాత, మళ్ళీ ఖమ్మంవచ్చాక ఆయన ఎక్కువగా ఏమీరాయలేదా?’ ‘రాశారు.కాని తెలంగాణ ఉద్యమం ముందూ వెనకా ఉన్న రచనల్లోని తీవ్రతవాటిల్లోలేదు. ఆయన రచయితగా ఒక సైనికుడిలాంటివారు. యుద్ధసమయం అయిపోయాక, ఆయన ప్రధానంగా అనువాదాల్లోకి వెళ్ళిపోయారు. మనిషిలో నిదానం వచ్చింది.నిబ్బరంగా కవిత్వం రాసుకున్నారు’ వరలక్ష్మిగారితో మాట్లాడాక, కవిరాజమూర్తి నవలని మరోసారి చదివాను. ఒక నవల సమకాలీన సమాజాన్నిగురించి ఎన్ని విధాలుగా, ఎన్ని స్వరాలలో మాట్లాడుతుందో అర్థమైంది. సమాజం చీలుదారుల్లో నిలబడిన రచయిత ఎన్ని విషయాలు చూడగలడో, వాటికి ఎంత లోతయిన భాష్యం ఇవ్వగలడో అర్థమైంది. ఒక నవల సాంఘిక చరిత్రగా మారి, అప్పటి అనేక భౌతిక,మానసిక స్థితిగతులకు ప్రతిఫలనం ఎలా అవుతుందో తెలిసివచ్చింది. అన్నింటికీ మించి- ఈ నవల ప్రధానంగా చర్చకిపెట్టిన అంశం:-మతం. ఇప్పుడు ముస్లిం భాషగా ముద్రపడిపోయిన ఉర్దూలో ఒక ముస్లిమేతరుడైన రచయిత ఇస్లాంనీ, నైజాం పాలనలోని ‘ఇస్లామీకరణ’నీ ఎట్లా అర్థం చేసుకున్నాడని వేరే చర్చ.

(Andhrajyothy Oct 10,2007)