లోరీన్! నువ్వే వొక కవిత!

శనివారం మాడిసన్-విస్కాన్సిన్ కి 45 నిమిషాల దూరంలో వున్న ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి లోరీన్ నైడెక్కర్ ఇల్లూ, సమాధి చూడడానికి వెళ్ళాం నేనూ, నా కవిమిత్రుడు ఆస్టిన్ స్మిత్. మాడిసన్ వచ్చిన కొత్తలో వొక పాత పుస్తకాల షాపులో కవిత్వం పుస్తకాలు చూస్తున్నప్పుడు నా పక్కనే వున్న వొక అమెరికన్ కవయిత్రీ, స్నేహితురాలు “ఈ కవిత్వం చదువు” అంటూ అప్పటికప్పుడు లోరీన్ పుస్తకాన్ని కొని ఇచ్చింది. “1940 ల కవిత్వం కాదు, నేను 2000 తరవాతి కవిత్వం చదవాలి. ఇది నాస్టాల్జియా వాసనేస్తోంది” అన్నాను నేను నవ్వి. “నువ్వు ముందు చదువు. నీ కాలానికి అది నాస్టాల్జియా. ఆ కాలానికి అది విప్లవం” అందామె.

(మిగిలిన భాగం “ప్రాణహిత”లో చదవండి)Lorine Niedecker

ప్రచురితం:  on ఆగష్టు 7, 2009 at 1:21 అపరాహ్నం వ్యాఖ్యానించండి

నచ్చిన కథ : కూర్మనాథ్ ‘పూల గుర్తులు ‘

జ్ఞాపకాలు వేధిస్తాయే గాని

ఆప్యాయంగా పలకరించవు -

అని ఎప్పుడో రాసుకున్న వాక్యాన్ని మళ్ళీ పూల గుర్తుల ‘ (ప్రాణహిత, ఆగస్టు 2007) తో గుర్తు చేశాడు కూర్మనాథ్ ఈ మధ్య.

((మిగిలిన భాగం ‘పుస్తకం.నెట్’ లో…)

ప్రచురితం:  on జులై 19, 2009 at 3:53 అపరాహ్నం వ్యాఖ్యానించండి

అనువాద కవిత్వం ‘ దర్వాజ ‘ కొత్త శీర్షిక

 

దిక్కుల్ని కలిపే దారం కవిత్వం అనిపిస్తుంది కొన్ని కవితలు చదువుతూంటే – ఈ కవితలు చైనా మహాకవి హాన్ షన్ (అంటే చలి కొండ ) రాసినవి. వీటిని నేను అమెరికాలోని ప్రసిద్ధ కవి గేరీ స్నైడర్ అనువాదంలో చదివాను. గెరీ స్నైడర్ హాన్ షన్ ని వూరికే అనువదించ లేదు. అతని మాటల్లోని అంతస్సారాన్ని తన పదాల్లోకీ, ఆలోచనల్లోకీ ఇంకించుకున్నాడు. చాలా సార్లు గెరీ స్నైడర్ కవిత్వం చదువుతున్నప్పుడు హాన్ షన్ అతని కొత్త కవిత్వ భాషలోంచి తొంగి చూస్తుంటాడు. వాళ్లిద్దర్నీ విడి విడి వ్యక్తులుగా చూడడం కష్టమనిపిస్తుంది. ఒకరు ప్రాచీన కాలం నాటి కవి, మరొకరు అత్యాధునిక కవి.

అనువాద కవిత్వం ‘ దర్వాజ ‘ కొత్త శీర్షిక
చదవండి ‘ప్రాణహిత ‘ లో ….

ప్రచురితం:  on జులై 7, 2009 at 10:35 అపరాహ్నం వ్యాఖ్యానించండి

కొందరు స్నేహితులు…నాన్న…వొక అర్ధరాత్రి

కొందరు స్నేహితులు…నాన్న…వొక అర్ధరాత్రి

ఈ కవిత మిగతా ఈ నెల “ఈమాట”లో చదివి, మీ మాట కూడా రాయండి.

చిన్న చీకట్లు పెద్ద మరణాలు

ఎలా అవుతాయో ఎప్పటికీ అర్ధం కాదు

 కొన్ని మరణాలు పెద్ద చీకటిలా

 ముసురుకోవడం రోజూ తెలుస్తూనే వుంది.

http://www.eemaata.com/em/issues/200907/1452.html

ప్రచురితం:  on జులై 1, 2009 at 10:30 అపరాహ్నం వ్యాఖ్యానించండి

రిచార్డ్ ఈటన్ తో ఒక సంభాషణ

 

eatonచరిత్ర భాష అతనికి తెలుసు.  సంక్లిష్టమయిన పూర్వ ఆధునిక గతాన్ని అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్టు, వొక మరచిపోలేని కథలాగా చెప్పడం ఆయనకే సొంతమయిన శైలి. ఆయన వచనంలో  నిన్నటి చరిత్ర కళ్లకి కట్టినట్టు మన ముందు నిలబడుతుంది.  ఆయన పేరు రిచార్డ్ మాక్స్ వెల్ ఈటన్ . ఈ మధ్యనే ఆయన 1300 నుంచి 1761 వరకూ కాలాన్ని తీసుకుని రాసిన దక్కను చరిత్రని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అచ్చు వేసింది. ఇందులో ఆయన మనకు తెలిసిన సర్వాయి పాపడు, ప్రతాప రుద్రుడు, రామరాయలు, మహమూద్ గవాన్ ల వంటి చారిత్రక వ్యక్తుల గురించి మనకి తెలియని చరిత్ర కోణం నుంచి రాశారు.

(ఇంకా…)

ప్రచురితం:  on ఫిబ్రవరి 24, 2009 at 6:15 అపరాహ్నం అభిప్రాయములు (1 )
Tags:

వెనకటి కొండ గుర్తు

1567_2_1

వెనక్కి తిరిగితే దేహం బండ రాయి

వొక శిలా మరణ శాసనం

కనుపాపల్ని పట్టి లాగుతుంది. (ఇంకా…)

ప్రచురితం:  on ఫిబ్రవరి 21, 2009 at 3:42 అపరాహ్నం వ్యాఖ్యానించండి

వంశీ నుంచి వంశీకి…..

judynortonletter

ఎప్పుడో వొక కవితలో రాసినట్టు గుర్తు – వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలు – అని! ఇవాళ వొకే వొక్క సారిగా నీ వుత్తరాలన్నీ చదివాక అనిపించింది, వుత్తరాలు దూరాల్ని కలిపే దారాలే కాదు, తరాల్ని కలిపే, అంతరాల్ని చెరిపే సఖ్యరాగాలు అని! (ఇంకా…)

ప్రచురితం:  on ఫిబ్రవరి 17, 2009 at 6:12 అపరాహ్నం వ్యాఖ్యలు (3)

As I Went …

fastwalkerrex_468x312 

Something

Like a static object

I cannot freeze

 

Between wind and time

I am a wandering person

Even the sky fails to cover me

 

On this earth

Green signatures

How long it’s been since I’ve seen

 

Whichever way I look, it’s a desert

As far as I can see, nothing

 

All the symbols

Have lost

All the metaphors

Fell off

 

 Poetry

Just one dried leaf

 

Heart dried up

Well of sad worry

I am digging

 

Thirst is not quenched

Distance doesn’t lessen

 

In diverging pathways

Don’t ask where I’m going

 

Someway

One route

Let my foot fall

Only in my step

Let the sky be seen.

 

tr: Anupama Atluru

 

 

 

ప్రచురితం:  on ఫిబ్రవరి 15, 2009 at 4:40 అపరాహ్నం అభిప్రాయములు (1 )

After Reading…

When I put down this book

I realized unknowingly that

I wandered lonely in the snowy caves of the Himalayas

I also realized that

My fingers are wet with the red blood

That flowed on the pathways of my dream city Mumbai.

Snow and blood speak to me in the same language now.

 

When I put this book down

I realized that me and you

Put an end to endless conversation.

(ఇంకా…)

ప్రచురితం:  on ఫిబ్రవరి 14, 2009 at 3:37 అపరాహ్నం అభిప్రాయములు (1 )

వాయులీనమవుతూ….

 

 

లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
(ఇంకా…)

ప్రచురితం:  on ఫిబ్రవరి 12, 2009 at 1:54 పూర్వాహ్నం అభిప్రాయములు (1 )