నెత్తుటి నెమలీక

కాసేపు అంతా మరిచిపోవడమే బాగుంటుందనుకుంటా.పొయ్యిమీద వుడికే జొన్నన్నం వాసనలోంచి ఏ నెత్తుటి జ్ఞాపకమూ కలవరపెట్టకుంటేనే బాగుంటుందనుకుంటా. నరకహింసని విస్మ­ృతిలోకి జారనిచ్చి, సుఖగానమే చేద్దాంలే. మన గతాలు అందమైన రెక్కల గుర్రాలు, వన్నెచిన్నెల నెమలికన్నులు, అంతఃపురాల విలాసగీతాలు. నిజం కన్నా కల అందంగా వున్నప్పుడు, కలలాంటి వొక గతం మేడని కట్టుకుందాం.

ఎత్తయిన గోడల రాజప్రాసాదాల సుందరనందనవనాల సెలయేటి పరుగుల విశాల రహదారుల నగరాన్ని దాటి వొక్కసారి నా పల్లెలోకి నడిచివెళ్లు. కూలిన పూరి గుడిసెల ఇరుకురాదారుల కుప్పకూలిన రైతుదేహాల్ని ఇంకించుకుంటున్న శిధిలమైన పొలాల బండరాళ్ల ఎముకలు ముందుకు పొడుచుకొచ్చిన ఏర్లూ చెర్వుల నడుస్తున్న అస్తిపంజరాల నను కన్న నా పల్లెలోకి ఆగి ఆగివెళ్లు. గతం నీ అందమైన కల కదా, దొర గడీల ముందు చెప్పుల్విప్పి, గొడుగుల్మూసి దండం పెట్టడానికే వున్న దేహాన్ని, దాని వెన్నెముకనీ విల్లులా వంచి, వంగి వంగి నడవడం, నడవలేక నడవడం ఓహో… ఎంత అందంగా వుందో కదా.

ూూూ

నిజమే, కాసేపు ఈ విస్మ­ృతి అందంగానే వుంది. కానీ.. బానిస అమ్మనాన్నల బిడ్డలం కదా మేం. ఆకలితోనో ఆకలి మీద కోపంతోనో వెర్రి కేక వేసి, గోళ్లల్లో మేకులు దిగ్గొట్టించుకున్న బానిస అమ్మానాన్నల బిడ్డలం కదా మేం. కడుపునిండా ఆకలితో అర్థరాత్రి ఇంటికొచ్చిన అన్నకి కాస్త అంబలి పోసి నందుకు తెల్లారేటప్పటికి ఇల్లు ఇల్లంతా వల్లకాడయి తల నీడ పోగొట్టుకున్న తల్లి బిడ్డలం కదా మేం. తలుచుకున్న కొద్దీ తలపోతల జలపాతంలో తడిసిపోతున్నాంలే, ఇప్పుడు. కానీ.. నాదంతా నెత్తుటి తలపోత.. అప్పుడప్పుడూ కాసేపు ఆ నెమలీకల్ని మరిచిపోతేనే బావుణ్ను. కానీ…

ూూూ

ఈ శరీరానికి అది సయించడం లేదు. సరిహద్దుల లోపలా బయటా నేను శత్రువునే. ఎవరో ఇచ్చిన షేర్వానీ కప్పుకుని లోపలి గాయలన్నీ దాచుకోలేను. నా లోపల నెత్తురింకనంతకాలం ఏ రాజ్యానికీ నేను ముద్దుబిడ్డని కాలేను. 1948 రాత్రికి రాత్రి ఎల్లలు దాటేసి నా నేలని గిరవాటెయ్య లేదు. ఎక్కడైనా నాకేం మిగిలిందని? నేనె ప్పుడూ వెంటాడబడేదేహాన్ని సరిహద్దుకంచెలకి చిక్కుకుని తల వేలాడేసే అనాథని.

రాజ్యానికి ఆవల వొక ధిక్కార సూఫీ స్వర్గాన్ని నిర్మించుకున్నవాణ్ని. ధిక్కారం నా మతం నిరసన నా కులం గోళ్లల్లో మేకులు దిగ్గొట్టే రాజ్యాన్ని తూరుపు ఉరికంబం ఎక్కించడం ఒక్కటే నా రాజకీయం. నీ గతం కాల్మొక్కలేను ఆస్తిత్వ ఉన్మత్త ప్రేలాపనలో చరిత్రని నిలువునా వంచించలేను. ఎప్పటికీ బాంచన్ కాలేను వొక్క క్షణాన్నయినా విస్మ­ృతిలోకి జారిపోలేని వాణ్ని. కాలం నా వేళ్ల సందుల్లో గడ్డ కట్టిన నెత్తురు. దాన్ని తుడిచే సే పర్షియన్ ద్రావకం ఇంకా పుట్టలేదు.

– అఫ్సర్

Published in: on జనవరి 13, 2008 at 4:38 ఉద.  వ్యాఖ్యానించండి  

The URI to TrackBack this entry is: https://afsar2008.wordpress.com/2008/01/13/%e0%b0%a8%e0%b1%86%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%86%e0%b0%ae%e0%b0%b2%e0%b1%80%e0%b0%95/trackback/

RSS feed for comments on this post.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

<span>%d</span> bloggers like this: