డే జా వూ

నేను వచ్చిన తరువాత
మీ దిగుళ్ళలో మీరు,
మీ సంతోషాల్లో మీరు,
మీ రోజువారీ ఈతిబాధల్లో మీరు –
ఏమో! నేను నాకే వొక జ్ఞాపకంలా పడి వున్నాను.ఏ అన్నాల వేళో మరి
పొలిమేర దాటి,
దేశం దాటి,
సముద్రాలు దాటి వచ్చేశాను.
గుర్తున్నానా?
అని ఆ తరువాత నేనే మీకు గుర్తుచేసుకున్నాను
కాలాన్ని దాటకుండానే గతంలోకి జారుకుంటూ.

నిన్న రాత్రే
మీతో కూర్చున్నట్టుగా,
మాట్లాడినట్టుగా,
మీతో కలిసి అన్నం తింటున్నట్టుగా,
మీతో మేడమీద బిచానా వేసినట్టుగా –
ఏది అవునో ఏది కాదో?

ఏ దీపం వేళో నేను దిక్కుల్ని ముట్టి వచ్చేశాను
ఇప్పుడు కాయితమ్మీద రాస్తున్నప్పుడు
ఇది ఇప్పుడా కాదా అని సందేహం
టవర్‌క్లాక్‌లోంచి గంట మోగినప్పుడు
ఇప్పుడు నడుస్తున్న దారి వున్నట్టుండి నిన్నట్లోకి.
కాలాన్ని ఎక్కడో శుభ్రంగా జారవిడిచేశాను.

ఏ అన్నం వేళ
ఏ సగం కడుపుతో బయలుదేరానో
ఇప్పుడింకా ఆకలి
కడుపు నిండా
కళ్ళ నిండా!

జనవరి 2006

Published in: on జనవరి 14, 2008 at 2:02 ఉద.  వ్యాఖ్యానించండి  

The URI to TrackBack this entry is: https://afsar2008.wordpress.com/2008/01/14/%e0%b0%a1%e0%b1%87-%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b5%e0%b1%82/trackback/

RSS feed for comments on this post.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

<span>%d</span> bloggers like this: