మంచి మాటలు కొన్ని : ఒబామా- పుస్తక పరిచయం!

(పూర్తి సమీక్ష  http://kasturimuralikrishna.wordpress.com)

ఇంగ్లీషు పుస్తకాలు చదివేవారు, ఒబామా గురించి తెలుగు పుస్తకాన్ని చులకనగా చూడవచ్చు. కానీ, తెలుగులో పుస్తకాల ప్రచురణలో సాధక బాధకాలు తెలుసుకుంటున్న మనం ఇలాంటి ప్రయోగాలకు ప్రోత్సాహాన్నివ్వాలి. ఇలాంటి పుస్తకాలను ఆదరించాలి.

ఇలాంటి పుస్తకాలకు ఆదరణ వున్నదని నిరూపిస్తే, తెలుగు రచయితలు, ప్రచురణకర్తలు కూడా మరింత రీసెర్చ్ జరిపించి, మరింతగా ఇలాంటి పుస్తకాల ప్రచురణపై దృష్టి పెడతారు. అదీగాక, విద్యావంతులకు, పట్టణాలలో వున్నవారికీ ఆంగ్ల పుస్తకాలు దొరకటం కష్టం కాదు. కానీ, రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తెలుగు పుస్తకాలు లభ్యమవటమే గగనం. అలాంటి వారికి ఒబామా గురించి సమగ్రమయిన సమాచారాన్నందించి, ఒక అభిప్రాయాన్ని ఏర్పరచటంలో ఈ పుస్తకం దోహదపడుతుంది. కాబట్టి, ఈ పుస్తకాన్ని తాము కొనటమేకాక పదిమందికీ చెప్పి కొనిపించాలి. అప్పుడే వైవిధ్యభరితమయిన పుస్తకాలింకా వచ్చేవీలుంటుంది. ఈపుస్తకం వెల కూడా తక్కువే. కేవలం 50 రూపాయలే.

ఒబామా
స్ఫూర్తిదాయక విజయ గాథ.
రచన- గుడిపాటి.
ప్రతులకు- పాలపిట్ట
16-11-20/6/1/1
సలీం నగర్, మలక్ పేట్
హైదెరాబాద్-36.
ఈ మెయిలు- palapittabooks@gmail.com
వెల- 50 రూపాయలు.
పేజీలు-152.

యుద్దం ఇక్కడే…

 

 

 

war1

హు…వీళ్ల చుట్టూ గాలి కూడా కమురు వాసన

నాజీ సైనికుడి అసహన ద్వేష అమానుష నిట్టూర్పు

ఆ యూదు దహన స్థావరాల పరిసరాల పరివేదన ఇప్పుడూ వినిపిస్తుంది. (మరింత…)

Published in: on మే 27, 2009 at 10:02 సా.  4 వ్యాఖ్యలు  

కొయ్య కన్ను

  అతన్ని రోడ్డు  దాటిస్తున్న

ఆ కర్ర చప్పుడు

నా వెనక నీడలాగా. (మరింత…)

Published in: on మే 26, 2009 at 7:06 సా.  2 వ్యాఖ్యలు