అతన్ని రోడ్డు దాటిస్తున్న
ఆ కర్ర చప్పుడు
నా వెనక నీడలాగా.
తెరుచుకునే వున్న అతని చూపు కింద
ప్రపంచం వొక శూన్యపు గులక రాయి.
గిర గిరా తిరుగుతూనే వుంటుంది
అనేకార్ధాల
అనేక వర్ణాల చక్రంలాగా.
అతని కళ్ల కింద పొందిగ్గా
వొదిగి కూర్చున్న వాటి అర్ధాల కోసం
వెతుక్కుంటూ వుంటాను.
అసలు అర్ధం ఏమిటా అని
అదే పనిగా శోధిస్తూ వుంటాను.
ఈ లోపు అతను రోడ్డు దాటి వెళ్ళి పోయాడు.
నేను
రోడ్డు మధ్యలో
చిక్కుబడి పోయాను.
కొయ్యబారిన కన్నుతో .
*
కవిత బావుందండీ ….టైటిల్ కొయ్యబారిన కన్ను అనే పెట్టొచ్చుకదా ?
గురువుగారు
శిఖామణి గారు గుర్తుకు వచ్చారు. 🙂