హు…వీళ్ల చుట్టూ గాలి కూడా కమురు వాసన
నాజీ సైనికుడి అసహన ద్వేష అమానుష నిట్టూర్పు
ఆ యూదు దహన స్థావరాల పరిసరాల పరివేదన ఇప్పుడూ వినిపిస్తుంది.
యుద్ధానికి వొక కాలం లేదు, వొక స్త్ఘలమూ లేదు
అది ఇరాకో, పాలస్తీనానో కానక్కర్లేదు
రువాండానో, జాఫ్నానో, కాశ్మీరో కాకపోనూ వచ్చు.
యుద్ధం ఈ క్షణాన ఇక్కడే నా మీద
మూసిన కొద్దీ నా కిటికీ రెక్కల్ని భళ్లున పగలగొట్టి
ఎక్కడో నా పడగ్గదిలో సుఖశయ్య మీద వాలిపోదామనుకున్న కొద్దీ
నా పడక కింద నించి భూమి కంపించినట్టు
చదువుతున్న పుస్తకంలోంచి వొక అందమయిన పుటలోంచి
చిద్రమయిన నెమలీకలోని అనేక రంగుల రక్తపు మరకలంటి
నిద్రపొరల కింద ఎక్కడొ మేలుకొని పగిలే కలలో
చెల్లాచెదురయిన పూరిగుడిసె బాల్యపు కలవరింతల శకలాల ఆటలో
యుద్దం ఎక్కడో సరిహద్దుల దగ్గిరో
నిర్మానుష్య పర్వతాల్లోనో
సముద్రమధ్యాల్లోనో కాదు, ఇక్కడే..ఈ అరక్షణ కురుక్షేత్రమే!
వూళ్లని ముంచెత్తిన ఎడారులూ
వూళ్లని మింగేస్తున్న నగరాలూ
నగరాల్ని కప్పేస్తున్న మాయా మాల్ మహళ్లు
నమ్మకాల అమ్మకాలు
కూలిపోయిన నాస్టాల్జియా
బోధి కొమ్మల గ్రీటింగు కార్డులు యుద్ధ వాంగ్మూలాలు
నిన్నటి క్షణం ఇప్పటి పురాస్మృతి
రణ రంగం కానిదేదీ లేదు
చరిత్ర హడావుడి పరుగులు
ఆత్మహత్య వైపో…..చావు కర్మాగారాల చిమ్నీ గొట్టాల్లోకో!
*
“కూలిపోయిన నాస్టాల్జియా
బోధి కొమ్మల గ్రీటింగు కార్డులు యుద్ధ వాంగ్మూలాలు”
caalaa baavumdi..
హ్మ్ …
Its… amazing.
“రణ రంగం కానిదేదీ లేదు”
So true!
Nice poem.