పోస్టు కార్డు పొయెమ్ -1: నీరెండలో వూరు

 Terrace-chairs-after-rainC

 

ఎప్పుడు ఎలా కురవాలో

తెలుసు వానకి!

అనేక ధారధారల వాన తెరల్ని చీల్చుకొని

భూమ్మీదికి వాలింది పక్షి విమానంలాగా.

నిప్పులూసిన ఎండ తరవాత వానస్నానం

మట్టి వొంట్లోంచి అదే వాసన!

అయినా,

వొక వూరు యింకొక వూరు ఎప్పుడూ కాదు

 

*

చడీ చప్పుడూ లేకుండా

అలా కురుస్తూనే వుంది వాన

ఎప్పుడు ఎలా కురిసినా వొకేలా వుండడమే తెలుసు వానకి.

సాయంత్రపు చలి భుజాల్ని

తడి కురుల్నీ

సుతారంగా తాకుతూ మెత్తగా రాలింది

కాస్త ఎండ

చెట్ల ఆకుపచ్చ తలలు తళుక్కుమనేలా.

*

నీరెండ భాషలో ఏదో పాడుకుంటూ

ఆకాశం అటు అంచు నించి ఇటుదాకా

రెక్కలతో ఇంద్రధనస్సు కట్టి

అద్దరి చేరుకున్నాయి పక్షులన్నీ

దిగాలు పడిన దేహాల మీద

వొక గోరువెచ్చని నీడని వొంపి.

*

ఆ ఆకాశం ఈ ఆకాశం కాదు

ఆ పక్షులూ ఈ పక్షులు కావు

ఆ చెట్లూ ఈ చెట్లు కావు

ఏ వూరూ ఇంకో వూరు కాదు

అప్పుడప్పుడూ వెనక్కి చూడు

దాటి వచ్చిన వూరు

ఏమంటుందో విను.

 

(మాడిసన్ విస్కాన్సిన్ – జూన్ 6)

Published in: on జూన్ 8, 2009 at 2:51 ఉద.  6 వ్యాఖ్యలు  

The URI to TrackBack this entry is: https://afsar2008.wordpress.com/2009/06/08/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%af%e0%b1%86%e0%b0%ae%e0%b1%8d-1-%e0%b0%a8%e0%b1%80%e0%b0%b0/trackback/

RSS feed for comments on this post.

6 వ్యాఖ్యలువ్యాఖ్యానించండి

 1. అవునండీ ఆవూరు ఈవూరు కాదు కానీ ఉన్నదానిలోనే సర్దుకుపోక తప్పదని తెలిసినతరవాత,, మాడిసన్లో ఎటు వెళ్లినా చారెడు నీరు కనిపించి బే ఆఫ్ బెంగాల్ గుర్తు చేస్తోంది. 🙂
  బ్లాగు మొదలెట్టిన శుభసందర్భంలో శుభాకాంక్షలు.
  – మాలతి

 2. I can”t translate that pressured blood in to simple words. How can u write very easily in to plain words? One man can’t be another man. Let one village be another village. Let one country be another country. Let one universe be another universe. But no one can be another one.
  I request all the leaders, politicians, presidents of nations – Let the people to live with their own unique personalities, souls, genes and lastly with their own freedom.
  You are a poet. A poet is greater than a president, king, prime minister etc,. because he is a man/woman with freedom, love, vision and personality and what can I say? every thing. But he is unfortunate. impatient,
  Some whole expression is the great lie. It is the beautiful escape from his own personality (as Eliot said) Is it true. Let it be discussed.
  Congratulations for writing such a simple and viable poem.

 3. అమ్మో ఎన్ని వాన చినుకులో.తనివి తీరా తడిసాను.

 4. భలె అనుభూతి వున్న కవిత…ఆందరూ అనుభవించి పలవరించే ఫీలింగ్ ..

  ఎక్కడో ఎవరో అనగా విన్నాను అఫ్సర్ కవిత్వం గురించి…

  వెన్నెల్లో పెరుగన్నం
  అనుభూతే అఫ్సర్
  నవ కవితా క్రికెట్ లో
  ప్రతి కవితా సిక్సర్ !

  ఆ మాట నిజం అనిపించారు. ఎప్పటికప్పుడు కవిత్వాన్ని రెఫ్రెష్ చేస్తూ మా లాంటి అభిమానులకు మంచి కవిత్వాన్ని అందిస్తున్న అఫ్సర్ గారికి ధన్యవాదాలు.

  రవీంద్ర

 5. You have chosen a very interesting subject. Do continue.

  Sripati

 6. It is a gift to have the capability to express what you feel and then write for every one, great work Afsar keep it up!

  Best wishes
  Ramu


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

<span>%d</span> bloggers like this: