తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక ‘అపరిచితుడు’

1944తెలంగాణ గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ కొత్త. పూటకి ఠికానా లేదు. నిలువ నీడలేదు. అతికష్టంమీద కోఠీలో ఒక ఇరుకుగది దొరికింది. ఆ ఇరుకుగది అతని ప్రపంచమయ్యింది. కాదు, ప్రపంచమే అతని ఇరుకుగదిలో ఇమిడిపోయింది. ఎందరో తెలం గాణ యువరచయితలకు అది కేంద్రమయ్యింది. (మరింత…)

తెలుగు డయాస్పోరా: సాహిత్యం, సంస్కృతి

సాహిత్యం మనం సృష్టించుకున్న రెండో లోకం.

ఈలోకంలో కొంత నిజం, కొంత అనిజం- కొంత జీవితం, కొంత కలా కలగలిసి వుంటాయి. ఈ లోకానికి పాఠకుడు ఒక వైపూ, రచయిత ఇంకో వైపూ. వీళ్ళిద్దరూ కలిసే చోటు పుస్తకం. పుస్తకాలు చదివే అలవాటు, పుస్తకాలు రాసే అలవాటు నిజానికి ఒకే ఆలోచనాత్మక ప్రక్రియకి రెండు కోణాలు. పుస్తకం చదువుతున్నప్పుడు పాఠకుడూ, పుస్తకం రాస్తున్నప్పుడు రచయితా ఒకే విధమైన ప్రక్రియలో భాగస్వాములవుతారు. ఇద్దరూ ఆలోచనలోకి ప్రవేశిస్తారు. ఆ ఆలోచనే రెండో లోకం. (మరింత…)
Published in: on జనవరి 13, 2008 at 4:25 ఉద.  Comments (1)