పొద్దున్నే తలుచుకోవాల్సిన మనిషి!

 

సంపూర్ణ అనే సంస్కృతం పదం వాడను కాని, పూర్తి జీవితం ఎలా వుంటుందో నాకు ఇంకా తెలియదు, తెలుస్తుందన్న నమ్మకమూ లేదు. కాని, “యాది” చదివాక ఆ పూర్తి జీవితంలోని కనీసం ఒక కోణం నాకు తెలిసింది. జీవితం ఒక పదిలమయిన యాది ఎలా అవుతుందో తెలిసింది. నలుగురు మనుషుల మధ్య జీవితం పండగ అవుతుందని తెలిసింది. “యాది” నేను ఎప్పుడూ తలుచుకునే పుస్తకం” (మరింత…)

Published in: on మే 24, 2010 at 11:16 సా.  4 వ్యాఖ్యలు  

ఒక దశాబ్ది కవిత – కవితా సంకలనం 2000-2009

సారంగ బుక్స్

ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థ

—————————————————————-

              మంచి సాహిత్యాన్ని అచ్చులోకి, అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పానికి రూపం “సారంగ బుక్స్”. మా మొదటి ప్రచురణ 2000 నుంచి 2009 వరకీ వచ్చిన మంచి కవితల సంకలనం. ఈ సంకలనం జూలై మొదటి వారంలో వెలువడుతుంది. (మరింత…)

Published in: on మార్చి 30, 2010 at 1:43 సా.  వ్యాఖ్యానించండి  

“ఊరి చివర ” ఉప్పెనలా కవిత్వం

అడపాదడపా అంతర్జాలంలో చదవటమే అఫ్సర్ గారి కవిత్వాన్ని. అక్కడక్కడ, ఆయనని మాటల్లో దించి సందేహాలకు సమాధానాలు వెతుక్కునేవాడిని ఆయన వ్యాసాల్లో. అంతకు మించి ఆయనతో ఎటువంటి పరిచయం లేదు. అంతర్జాలంలో సాహితీ సహవాసానికి, ఆ మాత్రం పరిచయం సరిపోతుందేమో కదా! “ఊరి చివర” ఉప్పెనలా పొంగిన అఫ్సర్ గారి కవిత్వంపై నా అభిప్రాయమే ఈ వ్యాసం. (మరింత…)

Published in: on మార్చి 18, 2010 at 3:30 సా.  వ్యాఖ్యానించండి  

కొన్ని నిమిషాలు

 

ఇప్పుడింక

అన్ని చావుల్నీ

రెండు నిమిషాలతోనే కొలుస్తున్నా (మరింత…)

Published in: on మార్చి 12, 2010 at 2:53 ఉద.  వ్యాఖ్యానించండి  

అవిచ్చిన్న కవిత్వ ధార అఫ్సర్

నండూరి రాజగోపాల్ ఎడిటర్ గా వెలువడుతున్న “చినుకు” సాహిత్య మాస పత్రికలో ప్రముఖ కవి, సాహిత్య విమర్శకులు వంశీ కృష్ణ అఫ్సర్ కొత్త కవితా సంపుటి “ఊరి చివర” గురించి రాసిన సమీక్ష.

Published in: on మార్చి 10, 2010 at 1:40 సా.  3 వ్యాఖ్యలు  

నల్లానల్లని నవ్వు

 

మెట్రో బస్ వెనకాతల

వొక కితకితల నల్ల సముద్రమేదో

అల లలుగా తుళ్ళి తుళ్ళి పడ్తుంది

ఏ ఇరుకు నగర శరీరాన్నో పగలగొట్టి

నవ్వుల వానలో ముంచెత్తాలని.

వెనక్కి తిరిగి చూస్తాను

నా లోపలి అతిమర్యాద తెల్లకణమేదో

వొక్క క్షణం మర్యాదగా జూలు విదిలించి

ఆ నల్ల సముద్రంకేసి,

అసయ్యపు చూపులు పొడుస్తుంది.

అలా అలలు అలలుగా యెగసి పడలేక

నవ్వుల తరగలతో  ముంచెత్తుకోలేక

నవ్వలేని తనాన్ని దాచుకోలేక

లోపల ఎక్కడో గడి వేసుకుని

దూరానికి దొర్లిపోతాను.

మెట్రో బస్ వెనకాతల

వొక కితకితల నల్ల సముద్రమేదో

హోరు హోరుగా చిలిపి చిలిపిగా

వెంటాడ్తుంది నిద్రలోనూ

నిద్ర కళ్ళు వాలకుండా!

                            – అఫ్సర్

Published in: on జనవరి 11, 2010 at 2:06 సా.  వ్యాఖ్యానించండి  

గులాబీలు, ఓ వేసవి చివర

 

ఏమవుతుంది,

ఈ ఆకులన్నీ

ఎరుపెక్కి, బంగారు రంగు దాల్చి

రాలిపోయాక?

ఏమవుతుంది,

ఎప్పుడూ పాడే ఆ పిట్టలు

ఇక పాడలేనప్పుడు?

ఏమవుతుంది,

బిరాన పోయే ఆ రెక్కలకు?

అవునంటావా,

ఇక్కడ ఎవరి స్వర్గం వాళ్ళదేనా?

అవునంటావా,

ఆ చీకటి ఆవలి నించి

ఎవరో వొకరు

మనల్నే పనిమాలా పిలుస్తారంటావా?

ఆ చెట్ల ఆవల

పిల్లలకి పాఠాలు చెబ్తూనే వుంటాయి నక్కలు

లోయలో దిలాసగా బతికేదెలాగో?

అవి ఎప్పుడూ కనుమరుగు కావు నిజానికి,

ఎప్పుడూ అక్కడే వుంటాయి

ప్రతి పొద్దూ విరిసే

వెలుగు మొగ్గల్లో

ప్రతి చీకట్లో

ఆకసాన నిలిచి.

ఆ కొండ కోనల వరసలో

సముద్రం వెంబడి

చివరి గులాబీలు

తీయని వాసనల తయారీలో తలమునకలు

లోకానికి ఏదయినా ఇద్దామన్న తపనతో.

ఇంకో జన్మంటూ వుంటే

నేను

వొక చెక్కు చెదరని  ఈ సంతోషం కోసమే

అంతా గడిపేస్తా.

నేనో నక్కనవుతాను

వూగే కొమ్మల

చిన్ని చెట్టునవుతాను

ఆ గులాబీల తోటలో

వొక చిన్ని పూవునయినా దిగులు లేదు

భయమంటే ఏమిటో

తెలీదు కదా వాటికి.

కోరిక అంటే ఏమిటో

తెలీదు కదా వాటికి.

అసలు ఎందుకు అన్న ప్రశ్న

మనసులో పుట్టనే పుట్టదు కదా వాటికి.

పోనీ,

ఈ పూవు బతుకు ఎంత కాలం అన్న

దిగులు అసలు లేనే లేదు కదా వాటికి.

అసలు అలాంటెలాంటి

 పిచ్చి ప్రశ్నా వాటి మనసుని తొలిచెయ్యదు కదా!

  (మేరీ ఆలివర్ 2004 కవిత్వం “బ్లూ ఐరిస్ “లో “రోసెస్, లేట్ సమ్మర్” కి అనువాదం)

Published in: on జనవరి 8, 2010 at 6:46 సా.  వ్యాఖ్యానించండి  

అఫ్సర్ కొత్త కవితా సంపుటి “ఊరి చివర”

మిత్రులకు:

కొత్త ఏడాది శుభాకాంక్షలు. ఈ ఏడాది/ ఈ దశాబ్ది మీ జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటున్నా.

నా కొత్త కవితా సంపుటి “ఊరి చివర” వెలువడింది. పాలపిట్ట బుక్స్  వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడు విజయవాడలో  జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో పాలపిట్ట ప్రచురణలు అందుబాటులో వున్నాయి.

ఈ కవితా సంపుటి మీద వివిధ సమీక్షలనూ, వ్యాఖ్యలనూ త్వరలో “అక్షరం ” లో చూడ వచ్చు.

మీ
అఫ్సర్

Published in: on జనవరి 2, 2010 at 4:11 సా.  వ్యాఖ్యానించండి  

లోరీన్! నువ్వే వొక కవిత!

శనివారం మాడిసన్-విస్కాన్సిన్ కి 45 నిమిషాల దూరంలో వున్న ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి లోరీన్ నైడెక్కర్ ఇల్లూ, సమాధి చూడడానికి వెళ్ళాం నేనూ, నా కవిమిత్రుడు ఆస్టిన్ స్మిత్. మాడిసన్ వచ్చిన కొత్తలో వొక పాత పుస్తకాల షాపులో కవిత్వం పుస్తకాలు చూస్తున్నప్పుడు నా పక్కనే వున్న వొక అమెరికన్ కవయిత్రీ, స్నేహితురాలు “ఈ కవిత్వం చదువు” అంటూ అప్పటికప్పుడు లోరీన్ పుస్తకాన్ని కొని ఇచ్చింది. “1940 ల కవిత్వం కాదు, నేను 2000 తరవాతి కవిత్వం చదవాలి. ఇది నాస్టాల్జియా వాసనేస్తోంది” అన్నాను నేను నవ్వి. “నువ్వు ముందు చదువు. నీ కాలానికి అది నాస్టాల్జియా. ఆ కాలానికి అది విప్లవం” అందామె.

(మిగిలిన భాగం “ప్రాణహిత”లో చదవండి)Lorine Niedecker

Published in: on ఆగస్ట్ 7, 2009 at 1:21 సా.  వ్యాఖ్యానించండి  

నచ్చిన కథ : కూర్మనాథ్ ‘పూల గుర్తులు ‘

జ్ఞాపకాలు వేధిస్తాయే గాని

ఆప్యాయంగా పలకరించవు –

అని ఎప్పుడో రాసుకున్న వాక్యాన్ని మళ్ళీ పూల గుర్తుల ‘ (ప్రాణహిత, ఆగస్టు 2007) తో గుర్తు చేశాడు కూర్మనాథ్ ఈ మధ్య.

((మిగిలిన భాగం ‘పుస్తకం.నెట్’ లో…)

Published in: on జూలై 19, 2009 at 3:53 సా.  వ్యాఖ్యానించండి